ఓ వైపు కుమార్తె మరణం.. మరోవైపు రంజీలో కీలక మ్యాచ్.. బరోడా క్రికెటర్‌కి సెల్యూట్ చేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Ranji Trophy 2022: కష్టాలను అధిగమించి విష్ణు సోలంకి ఈ సెంచరీ సాధించగా.. అది చూసి బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో అతణ్ని రియల్ హీరో అని పిలిచారు.

ఓ వైపు కుమార్తె మరణం.. మరోవైపు రంజీలో కీలక మ్యాచ్.. బరోడా క్రికెటర్‌కి సెల్యూట్ చేస్తోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?
Vishnu Solanki
Follow us
Venkata Chari

|

Updated on: Feb 26, 2022 | 4:03 PM

Vishnu Solanki: రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో బరోడా తరపున ఆడిన విష్ణు సోలం(Vishnu Solanki)కి చండీగఢ్‌పై సెంచరీ చేశాడు. సెంచరీ కొట్టిన విష్ణుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్రీడాకారుడు తనలోని ఎంతో బాధను దాచిపెట్టుకుని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడే పుట్టిన తన అమ్మాయి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ లోకాన్ని వీడింది. కూతురి మరణం విష్ణును కుదిపేసింది. అయితే అతను తన కుమార్తెకు అంత్యక్రియలు చేసిన తర్వాత మైదానంలోకి వెళ్లి తన జట్టు తరపున సెంచరీ చేశాడు.

చండీగఢ్‌పై విష్ణు 12 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. బరోడా (Baroda)క్రికెట్ అసోసియేషన్ అతన్ని రియల్ హీరో అని అభివర్ణించింది. అతని బోల్డ్ ఇన్నింగ్స్ చూసి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. అదే సమయంలో, సౌరాష్ట్ర తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్న బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్ ట్వీట్ చేస్తూ, ‘విష్ణుకు, అతని కుటుంబ సభ్యులకు నమస్కరిస్తున్నాను. అతని బ్యాట్ నుంచి మరిన్ని సెంచరీలు రావాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో బరోడా తరపున ఆడిన విష్ణు సోలంకి చండీగఢ్‌పై సెంచరీ చేశాడు. సెంచరీ కొట్టిన విష్ణుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

టెండూల్కర్ కూడా తన తండ్రి మరణం తర్వాత సెంచరీ సాధించాడు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ మరణించిన వెంటనే 1999 ప్రపంచ కప్ సందర్భంగా సెంచరీ సాధించాడు. టెండూల్కర్ మాట్లాడుతూ, ‘నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మను చూసి భావోద్వేగానికి గురయ్యాను. మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె మరితం దిగాలుగా ఉంది. కానీ, ఆ దుఃఖంలో కూడా, నేను ఇంట్లో ఉండకూడదని, జట్టు కోసం ఆడాలని కోరుకుంది. కెన్యాపై ఆ సెంచరీ సాధించినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’ అని పేర్కొన్నాడు. కెన్యాపై సచిన్ 101 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లి విషయంలోనూ.. రంజీ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటిదే జరిగింది. అతను ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. అతని తండ్రి హఠాత్తుగా మరణించాడు. ఇదిలావుండగా, విరాట్ బ్యాటింగ్‌కు వచ్చి చక్కటి హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. అనంతరం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

Also Read: IND vs SL: రోహిత్ సేన విజయానికి అడ్డంకిగా మారిన వర్షం.. వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

IND vs SL: భారత్‌ను కలవరపెడుతున్న ధర్మశాల మైదానం.. ఇక్కడ టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..