IND vs SL: భారత్‌ను కలవరపెడుతున్న ధర్మశాల మైదానం.. ఇక్కడ టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..

మొదటి టీ20లో గెలిచి మంచి ఊపు మీద ఉన్న టీమిండియాకు ధర్మశాల(Dharamshala) వేదిక కలవర పెడుతుంది...

IND vs SL: భారత్‌ను కలవరపెడుతున్న ధర్మశాల మైదానం.. ఇక్కడ టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..
India Vs Sri Lanka
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 26, 2022 | 8:22 AM

మొదటి టీ20లో గెలిచి మంచి ఊపు మీద ఉన్న టీమిండియాకు ధర్మశాల(Dharamshala) వేదిక కలవర పెడుతుంది. భారత్, శ్రీలంక(IND vs SL) టీ20 సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండియా రికార్డు అంత బాగోలేదు. ధర్మశాలలో భారత్ ఇప్పటివరకు 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, అందులో 3 గెలిచి 3 ఓడింది. ఈ 6 మ్యాచ్‌లలో, T20 ఒక మ్యాచ్ మాత్రమే, 2015లో దక్షిణాఫ్రికా(South Africa)తో భారత్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఓడిపోయింది. చుట్టూ దౌలాధర్ మంచు శిఖరాలతో ఉన్న ఈ మైదానం తరచుగా బ్యాట్స్‌మెన్‌లకు సవాల్‌గా ఉంటుంది. ఇక్కడి ఫాస్ట్, బౌన్సీ పిచ్‌పై బౌలర్లు స్వింగ్ పొందుతారు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 199 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ గడ్డపై జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక కూడా టీమిండియాను ఓడించింది.

2017 డిసెంబర్ 10న ధర్మశాలలో భారత్-శ్రీలంక మధ్య వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 112 పరుగులకే ఆలౌటవ్వగా.. శ్రీలంక 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ రోజు ధర్మశాలలో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ పూర్తిగా ధ్వంసమైంది. తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ సురంగ లక్మల్ టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూల్చాడు.కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఖాతా కూడా తెరవలేకపోయారు.

మనీష్ పాండే 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. 9 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా 10 పరుగులు చేయగలిగాడు. దీంతో టీమిండియా కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అందుకే ధోనీ అద్భుతంగా 65 పరుగులు చేసి స్కోరును 100 దాటించి టీమ్ ఇండియా పరువు కాపాడాడు. కేవలం 38.2 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైన టీమ్ ఇండియా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు శనివారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఆ ఓటమిని గుర్తుపెట్టుకుని శ్రీలంకను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలి.

Read Also.. Rohit Sharma: శ్రీలంకపై విజయంతో రికార్డు సృష్టంచిన రోహిత్ శర్మ.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గుర్తింపు..