IPL 2022: ఐపీఎల్‌లో సరికొత్త ఫార్మాట్.. 2 గ్రూప్‌లు, 14 మ్యాచ్‌లు.. 5 జట్లతో రెండేసి.. నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్..

ఐపీఎల్-2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది...

IPL 2022: ఐపీఎల్‌లో సరికొత్త ఫార్మాట్.. 2 గ్రూప్‌లు, 14 మ్యాచ్‌లు.. 5 జట్లతో రెండేసి.. నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్..
Ipl
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 26, 2022 | 8:53 AM

ఐపీఎల్-2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే ఈసారి పది జట్లు తలపడబోయే ఐపీఎల్‌లో 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటించారు. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఐపీఎల్‌ ఛాంపియన్‌షిప్‌ను ఏ జట్టు ఎన్నిసార్లు గెలుచుకుంది, ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకుందనే వివరాలను దృష్టిలో పెట్టుకుని పది జట్లను రెండు వర్చువల్‌ గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టూ 14 లీగ్‌ మ్యాచ్‌లను ఆడాలి. ఏడు సొంత మైదానంలో మరో ఏడు బయట స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లను వాంఖడే, డీవై పాటిల్‌ మైదానాల్లోనూ.. మూడేసి మ్యాచ్‌లను సీసీఐ (ముంబయి), ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియాల్లో (పుణె) ఆడాలి. వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, సీసీఐ మైదానంలో 15, డీవై పాటిల్‌ స్టేడియంలో 20, పుణె ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టుకు సొంతమైదానం ఏదనేది నిర్ణయించాల్సి ఉంది.

2022 IPL తన 10 జట్లకు సీడింగ్‌లను ఇస్తుంది మరియు టోర్నమెంట్ యొక్క లీగ్ దశలో వారిని రెండు “వర్చువల్” గ్రూపులలో ఉంచుతుంది. ఒక జట్టు ఐపీఎల్‌లో ఎన్నిసార్లు గెలిచింది లేదా ఫైనల్‌కు చేరింది అనే దాని ఆధారంగా సీడింగ్‌లు ఉంటాయి. గ్రూప్‌-ఏలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా, నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ నం.2 సీడింగ్‌తో గ్రూప్‌బికి నాయకత్వం వహిస్తుంది. గ్రూప్-ఎలోని ఇతర జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్. గ్రూప్-బిలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.

పది జట్లను వాటి ప్రదర్శన ఆధారంగా రెండు గ్రూప్‌లుగా విభజించింది. గ్రూప్‌-Aలో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్‌-Bలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని టీమ్‌తో రెండేసి మ్యాచ్‌లను ఆడాలి. ఇక రెండో గ్రూప్‌లోని ఓ జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది.

Ipl 2022 (1)

Ipl 2022 (1)

ఉదాహరణకు.. చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటే.. ఈ జట్టు గ్రూప్‌-బిలో ఉంది. ఇక్కడ ఉన్న ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ, పీబీకేఎస్‌, గుజరాత్‌తో రెండేసి మ్యాచ్‌లను ఆడుతుంది. గ్రూప్‌-ఏలోని ముంబయితో రెండు మ్యాచ్‌లు.. కేకేఆర్‌, ఆర్ఆర్, డీసీ, ఎల్‌ఎస్‌జీతో ఒక్కో మ్యాచ్‌ను ఆడాలి. శుక్రవారం కొత్త ఫార్మాట్‌ను ఆవిష్కరించారు. శ్రీలంకతో భారత్ స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ ముగిసిన 10 రోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది. అంటే RM లోధా కమిటీ సిఫార్సులకు ఈ విరుద్ధం. భారతదేశం ఆడిన ఏదైనా అంతర్జాతీయ సిరీస్/టోర్నమెంట్, IPL మధ్య రెండు వారాల గ్యాప్ తప్పనిసరి అని లోధా కమిటీ పేర్కొంది.

Read Also.. IND vs SL: భారత్‌ను కలవరపెడుతున్న ధర్మశాల మైదానం.. ఇక్కడ టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..