అరెస్ట్ పైన స్పందించిన క్రికెటర్ రైనా.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని వివరణ..

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్  సురేశ్‌ రైనాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో..

అరెస్ట్ పైన స్పందించిన క్రికెటర్ రైనా.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని వివరణ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 22, 2020 | 9:01 PM

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్  సురేశ్‌ రైనాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో ఓ సింగర్‌ తో పాటు రైనాను అరెస్టు చేసారు పోలీసులు. నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వహించడంతో పాటు కరోనా నియమాలు పాటించకుండా వ్యవహరించినందుకు దాడులు చేయగా రైనాతో పాటు మరో 34మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ సెలెబ్రిటి సుసాన్‌ ఖాన్‌ సైతం అరెస్టైన వారిలో ఉన్నారు. ఆతర్వాత బెయిల్ పై వారు బయటకు వచ్చారు.

ఈ విషయంపై రైనా మేనేజ్‌మెంట్‌ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. “సురేశ్‌ రైనా షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చారు. షూటింగ్‌ ఆలస్యం కావడంతో స్నేహితుడి ఆహ్వానం మేరకు త్వరగా డిన్నర్‌ చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీకి ప్రయాణం చేయాల్సింది. కానీ ఆయనకు స్థానిక నిబంధనలు, సమయం గురించి అవగాహన లేదు. ఈ విషయం తెలియగానే రైనా అధికారుల వద్దకు వెళ్లి విచారం వ్యక్తం చేశారని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటారని” తెలిపారు.