AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే.. కట్ చేస్తే.. 5107 రోజుల శాపానికి.!

MI Vs KKR: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమిపై కెప్టెన్ అజింక్య రహనే స్పందించాడు. బలమైన బ్యాటింగ్‌ను ఎదుర్కోవడంలో బౌలింగ్ అనుభవం లేమి ప్రధాన లోపమని అతడు అంగీకరించాడు. కామరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం చూపించిందని, బ్యాటింగ్‌కే పరిమితం కావడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోందని రహనే అసహనం వ్యక్తం చేశాడు.

అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే.. కట్ చేస్తే.. 5107 రోజుల శాపానికి.!
Mi Vs Kkr
Ravi Kiran
|

Updated on: Mar 30, 2026 | 7:16 AM

Share

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ 2026లో జరిగిన రెండో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి.. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గత ఏడు సార్లు ఇరు జట్ల మధ్య జరిగిన ఏ మ్యాచ్‌లోనూ 220 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించని ముంబై ఈసారి ఆ రికార్డును తిరగరాసింది.

కేకేఆర్ బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరిచి భారీ స్కోరు సాధించినప్పటికీ, ఓటమికి పలు కారణాలున్నాయని కెప్టెన్ అజింక్య రహనే మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ పవర్ ప్లే నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడటం ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా రహనే పేర్కొన్నారు. కేకేఆర్ బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం స్పష్టంగా కనిపించిందని అంగీకరించాడు. యువ బౌలర్లైన వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబాని లాంటివారు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌తో ఆడినందున తమ బౌలర్లకు ఒక గుణపాఠమని రహనే అభిప్రాయపడ్డారు.

కేకేఆర్ ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు కూడా ఓటమికి కారణమయ్యాయి. అంతేకాకుండా, 25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ కామరూన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యాడు. అతను కేవలం 10 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని రహనే పేర్కొన్నాడు. తమ జట్టు కూర్పు గ్రీన్ బౌలింగ్ చేస్తేనే సక్రమంగా ఉంటుందని రహనే స్పష్టం చేశాడు. మ్యాచ్ కీలక దశలో కండరాల నొప్పితో తాను మైదానాన్ని వీడినట్లు రహనే తెలిపాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానని అభిమానులకు భరోసా ఇచ్చాడు. కాగా, ఆస్ట్రేలియా బోర్డు అభ్యంతరం కారణంగానే కామరూన్ గ్రీన్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైతే, 25 కోట్ల విలువైన ఆటగాడిని కొనుగోలు చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ బౌలింగ్ చేయకపోతే రాబోయే మ్యాచ్‌లలో కేకేఆర్‌కు మరిన్ని ఓటములు తప్పవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us
అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..
అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్