ఒక్క మ్యాచ్‌తో హీరో అయ్యాడు.. రెండు అదిరిపోయే ఛాన్స్‌లు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా?

| Edited By: Anil kumar poka

Aug 24, 2021 | 11:29 AM

IPL 2021 Phase 2: డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు కనబరిచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో..

ఒక్క మ్యాచ్‌తో హీరో అయ్యాడు.. రెండు అదిరిపోయే ఛాన్స్‌లు దక్కించుకున్నాడు.. ఎవరో తెలుసా?
Ipl 2021 Updates
Follow us on

డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు కనబరిచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం సంపాదించాడు. డెబ్యూ మ్యాచ్‌తోనే హ్యాట్రిక్ సాధించాడు. ఒక మ్యాచ్‌తోనే హీరో అయ్యాడు. ఇంకేముంది ఆ మ్యాచ్ అయిన తర్వాతి రోజే రెండు అదిరిపోయే అవకాశాలను దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించాడు. ఆ వెంటనే ధనిక లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి పిలుపు వచ్చింది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరనుకున్నారా.? ఎవరో కాదు.. ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్.

నివేదికల ప్రకారం, యూఏఈ వేదికగా ఐపీఎల్‌ సెకండాఫ్‌లో కెఎల్ రాహుల్ సారధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగబోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పంజాబ్‌ బౌలర్లు జాయ్ రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్ ఐపీఎల్ సెకండాఫ్‌కు దూరమయ్యారు. వీరిద్దరిని వేలంలో పంజాబ్ జట్టు అధిక మొత్తాన్ని వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.

వీరిద్దరికి బదులుగా మరో ఇద్దరు బౌలర్లను రీప్లేస్‌ చేయాల్సి ఉండగా.. వారిలో ఒకరిగా నాథన్ ఎల్లిస్‌ను తీసుకున్నాం. ”ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చేసిన అధికారిక ప్రకటన తర్వాతే మేము ఎల్లిస్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకున్నట్లు పంజాబ్ జట్టు అఫీషియల్ సతీష్ మీనన్ అన్నారు. రెండో రీప్లేస్‌మెంట్‌ను కూడా రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు”. కాగా, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ఎల్లిస్ డీల్ గురించి మీడియాతో మాట్లాడింది. మూడు ఫ్రాంచైజీలు ఎల్లిస్‌ను సంప్రదించారని.. చివరికి పంజాబ్ జట్టుతో డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది.

అరంగేట్రంలో ప్రపంచ రికార్డు..

బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా ఎల్లిస్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి 3 బంతుల్లో ఎల్లిస్ ఈ హ్యాట్రిక్ సాధించాడు. దీనితో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Read Also: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయం అవుతుందా? రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో చూడండి!

సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం..!

గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ