IND vs WI: పుజారా, షమీ స్థానంలో ఆడేది ఎవరు? టీమిండియా ప్లేయింగ్ 11పై తేల్చేసిన వైస్ కెప్టెన్..
Ajinkya Rahane: భారత్ వెస్టిండీస్ పర్యటనకు కౌంట్‌డౌన్ మొదలైంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జులై 12 నుంచి జరగనుంది. ఈసారి వెస్టిండీస్ పర్యటనలో ఛెతేశ్వర్ పుజారా, మహ్మద్ షమీ టీమిండియాతో ఉండరు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎవరు భర్తీ చేస్తారు? వారి స్థానంలో ఎవరు ఆడతారు. ప్లేయింగ్ XIలో ఇవే పెద్ద ప్రశ్నలుగా మారాయి.
భారత్ వెస్టిండీస్ పర్యటనకు కౌంట్‌డౌన్ మొదలైంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జులై 12 నుంచి జరగనుంది. ఈసారి వెస్టిండీస్ పర్యటనలో ఛెతేశ్వర్ పుజారా, మహ్మద్ షమీ టీమిండియాతో ఉండరు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎవరు భర్తీ చేస్తారు? వారి స్థానంలో ఎవరు ఆడతారు. ప్లేయింగ్ XIలో ఇవే పెద్ద ప్రశ్నలుగా మారాయి. జట్టు వైస్ కెప్టెన్, అజింక్య రహానే, ఈ ప్రశ్నలకు సమాధానం చూపాడు.
పుజారా, షమీ లేని పక్షంలో ఏ ఆటగాడికైనా తానేంటో నిరూపించుకునేందుకు ఇదో పెద్ద అవకాశం అని అజింక్యా రహానే ప్రకటించాడు. పుజారా లేకపోవడంతో టీమిండియా నంబర్ 3 స్థానం ఖాళీగా ఉంది. అదే సమయంలో షమీ లేకపోవడంతో, బౌలింగ్ దళం ఒకింత అనుభవం లేనిదిగా కనిపిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టులో ఈ ఇద్దరు ఆటగాళ్ల స్థానంలో సరైన ఆటగాడే వస్తాడు.
3వ స్థానంలో ఎవరు?
పుజారా టీమిండియాలో 3వ స్థానంలో ఆడేవాడు. పుజారాను భారత క్రికెట్ నయావాల్ అని పిలుస్తుంటారు. అతను అనేక టెస్టులను సింగిల్‌గా గెలిపించాడు. లేదా వాటిని డ్రాగా మలిచాడు. వెస్టిండీస్‌పై పుజారా బ్యాటింగ్ సగటు 35కి చేరువలో ఉంది.
ఇప్పుడు పుజారా స్థానంలో ఎవరు ఉంటారన్నది ప్రశ్న. కాబట్టి దీనిపై రహానే స్పందిస్తూ ఈ ప్లేస్‌లో ఆడగల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. ఈ అవకాశం ఎవరికి వచ్చినా వారికి పెద్ద అవకాశంగా నిలుస్తుందని అన్నాడు.
ఇక్కడ ఏ ఒక్క క్రికెటర్ పేరు కూడా రహానే తీసుకోకపోవడం గమనార్హం. కానీ, పుజారా స్థానంలో రేసులో ముందున్న పేరు యశస్వి జైస్వాల్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 80 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు. ఇది కాకుండా, బార్బడోస్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో యశస్వి తన అద్భుతమైన ఫామ్‌కు ఓ ట్రైలర్‌ను కూడా చూపించాడు.
షమీ కాకపోతే సిరాజ్, ఉనద్కత్..
టీమ్ ఇండియాలో షమీ స్థానంలో ఆడేందుకు రహానే సిరాజ్, ఉనద్కత్ పేర్లను తీసుకున్నాడు . ఇద్దరికీ ఎంతో అనుభవం ఉందని అన్నాడు. ఇద్దరూ ఎర్ర బంతికి గొప్పగా రాణించిన బౌలర్లు. అలాంటి పరిస్థితుల్లో షమీ స్థానంలో ఎవరు వచ్చినా బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..