Delhi Capitals: ఐపీఎల్-2022 టోర్నీ తుది దశకు చేరుకుంది. ముంబై, చెన్నై జట్లు మినహా అన్ని జట్లు ఫ్లే ఆఫ్ రేసులో హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈక్రమంలో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు సాధించింది. మొత్తం 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా ఢిల్లీ ఫ్లే ఆఫ్ రేసుకు చేరుకోవాలంటే మిగతా మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో ఆజట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న ఆజట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మిగతా రెండు మ్యాచులకు కూడా అందుబాటులో ఉండడని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తెలిపాడు.
‘పృథ్వీ షాను మేం చాలా మిస్సవుతున్నాం. అతను టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అయితే పూర్తిగా ఎప్పుడు రికవరీ అవుతాడనేది చెప్పలేకున్నాం. కాబట్టి సీజన్‌లో మిగతా లీగ్ మ్యాచ్ లకు అతను అందుబాబులో ఉండకపోవచ్చు. షా జట్టుకు దూరమవడం మాకు తీవ్ర కొంచెం ఇబ్బందే. ఎందుకంటే ఇప్పుడు మేం ప్లేఆఫ్స్ రేసులో కీలక దశలో ఉన్నాం. ఇలాంటి సమయంలో షా సేవలు కోల్పోవడం మాకు నష్టమే’ అని వాట్సన్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్ లో 9 మ్యాచులాడిన పృథ్వీ షా.. 259 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఆడిన గత మూడు మ్యాచుల నుంచి షా ఆడడంలేదు. అతని ప్లేస్లో వచ్చిన శ్రీకర్ భరత్ కూడా పూర్తిగా విఫలమవుతుండడంతో ఆ జట్టు ఓపెనింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
మిగతా క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: