- Telugu News Photo Gallery IPL 2022: Ravindra jadeja net worth profile and lifestyle horse riding and fencing
IPL 2022: తండ్రేమో సెక్యూరిటీ గార్డు.. తల్లేమో నర్సు.. కట్ చేస్తే టీమిండియాలో స్టార్ ఆల్‌రౌండర్.. కోట్లలో ఆస్తులు..
IPL 2022: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐపీఎల్ 2022 సీజన్ అంతగా అచ్చిరాలేదు. టోర్నీ ప్రారంభంలో CSK కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతను టోర్నీ మధ్యలోనే మళ్లీ ఎంఎస్ ధోనీకి సారథ్య బాధ్యతలను అప్పగించాడు.
Updated on: May 13, 2022 | 4:51 PM

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐపీఎల్ 2022 సీజన్ అంతగా అచ్చిరాలేదు. టోర్నీ ప్రారంభంలో CSK కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతను టోర్నీ మధ్యలోనే మళ్లీ ఎంఎస్ ధోనీకి సారథ్య బాధ్యతలను అప్పగించాడు.

జడేజా ఖాళీ సమయంలో ఎక్కువగా తన ఇంట్లోనే గడుపుతాడు. తన ఫామ్‌హౌస్‌లో గుర్రపు స్వారీ చేస్తూ సమయాన్ని గడుపుతుంటాడు. ఫెన్సింగ్ అతనికి ఇష్టమైన హాబీ.

సీజన్ ప్రారంభంలో సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజా టోర్నీ మధ్యలోనే ధోనికి బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీకే దూరమయ్యాడు.

రవీంద్ర జడేజా తన కఠోర శ్రమతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే జడేజా క్రికెట్ ప్రస్థానం అనుకున్నంత సలువుగా ఏమీ జరగలేదు. అతను తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బంది పడ్డాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తండ్రి జామ్‌నగర్‌లో సెక్యూరిటీ గార్డు. అమ్మ ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది.

రవీంద్ర జడేజా 2016లో రివాబా జడేజాను పెళ్లాడాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రివాబా రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు.

జడేజా ఏడాది ఆదాయం దాదాపు రూ.16 కోట్లు. అతని గ్యారేజ్‌లో హ్యుందాయ్ యాక్సెంట్, ఆడి క్యూ7, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 కార్లు ఉన్నాయి.

రాజ్‌పుత్ వంశానికి చెందిన జడేజా హాఫ్ సెంచరీ, సెంచరీ కొట్టిన తర్వాత మైదానంలో బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటాడు.

జడ్డూగా పేరుగాంచిన రవీంద్ర జడేజా డిసెంబర్ 6, 1988న జామ్‌నగర్‌లో జన్మించాడు. అతని తల్లి రవీంద్రను క్రికెటర్ కావాలని కోరుకుంటే, తండ్రి మాత్రం కొడుకును ఆర్మీలో ఉండాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తూ జడేజా తల్లి కుమారుడిని టీమ్ ఇండియా జెర్సీలో చూడకుండానే కన్నుమూసింది. 2006 అండర్-19 ప్రపంచకప్‌కు ఒక ఏడాది ముందు జడేజా తల్లి మరణించింది.

రవీంద్ర జడేజా IPL 2008 మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఆ మరుసటి ఏడాదే అతను టీమిండియాలో చోటు సంపాదించాడు. మధ్యలో జట్టులోకి వస్తూ పోతూ ఉన్నా కొన్నేళ్ల నుంచి టీంలో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు.

జడేజా చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో స్టార్ క్రికెటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నివేదికల ప్రకారం జడేజా ఆస్తుల విలువ రూ.97 కోట్లు.




