ఒళ్లు కొవ్వెక్కింది.. బీసీసీఐ తరిమేసింది.. కట్‌చేస్తే.. 7.5 కోట్ల నుంచి 75 లక్షలకు దిగజారిన బ్యాడ్ లక్ ప్లేయర్

ఐపీఎల్ మెగా వేలం తేదీలతో పాటు ఆటగాళ్ల బ్రేస్ ప్రైజ్ వివరాలు కూడా వచ్చాయి. నవంబర్ 24, 25 తేదీల్లో 1574 మంది ఆటగాళ్ల కోసం బిడ్డింగ్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్ పృథ్వీ షా తన ధరను గత జీతం కంటే 10 రెట్లు తగ్గించి, మెగా వేలంలో కనిపించనున్నాడు.

ఒళ్లు కొవ్వెక్కింది.. బీసీసీఐ తరిమేసింది.. కట్‌చేస్తే.. 7.5 కోట్ల నుంచి 75 లక్షలకు దిగజారిన బ్యాడ్ లక్ ప్లేయర్
Prithvi Shaw
Follow us
Venkata Chari

|

Updated on: Nov 06, 2024 | 5:08 PM

ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో 1574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో అన్ని జట్లు ఈ ఆటగాళ్లను దక్కించుకునేందుకు పోటీపడనున్నాయి. వేలం సందర్భంగా ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్ ను నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నాళ్లుగానో టీమిండియాకు దూరమైన పృథ్వీ షా.. మరోసారి తన లక్‌ను ఐపీఎల్‌లో పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ప్రస్తుతం అతని పేలవ ఫాంతో వేలానికి ముందే భయపడినట్లు తెలుస్తోంది. అతను ఎక్కువ ధరను ఉంచితే ఏ జట్టు కూడా తనను కొనడానికి ఇష్టపడదని ముందే గ్రహించి, తన బేస్ ప్రైజ్‌ను తగ్గించుకున్నాడు. దీంతో పాత జీతం నుంచి 10 రెట్లు తగ్గించుకుని ఐపీఎల్ వేలంలో కనిపించనున్నాడు. ఐపీఎల్ 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అతని జీతం గత 2 సీజన్లలో రూ.7.5 కోట్లుగా ఉంది. కానీ, రాబోయే వేలం కోసం షా బేస్ ప్రైజ్‌ను కేవలం రూ .75 లక్షలుగా ఉంచాడు. అయితే బిడ్డింగ్ సమయంలో తుది ధరను నిర్ణయిస్తారు.

మరోవైపు పృథ్వీ షా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ తో పోల్చిన పృథ్వీ మూడేళ్లుగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. దీనికితోడు అతని ఫామ్ కూడా సహకరించడం లేదు. అదే సమయంలో ఫిట్‌నెస్ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రంజీ జట్టు నుంచి కూడా అతడిని తప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతడిని జట్టు నుంచి తప్పించి రిటెన్షన్ లిస్ట్ నుంచి తొలగించింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తన బేస్ ప్రైజ్‌ను తగ్గించుకున్నాడు.

పృథ్వీ షా ఐపీఎల్ జర్నీ..

పృథ్వీ షా ఐపీఎల్ ద్వారా రూ.19.80 కోట్లు సంపాదించాడు. 2018 అండర్-19 ప్రపంచకప్ కెప్టెన్‌గా వ్యవహరించిన షాను అదే ఏడాది ఢిల్లీ జట్టు రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీ జట్టుతో అనుబంధం ఉంది. 2022 నాటికి ఢిల్లీ తన పారితోషికాన్ని రూ. 7.5 కోట్లకు పెంచింది. కానీ, 2 సీజన్ల తర్వాత జట్టు అతడిని తప్పించింది. గత సీజన్లో 8 మ్యాచుల్లో అవకాశం వచ్చినా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. దీంతో ఆ తర్వాత అతడిని తొలగించారు. పృథ్వీ 8 మ్యాచ్‌ల్లో 163 స్ట్రైక్ రేట్‌తో 198 పరుగులు చేశాడు.

అయోమయంలో సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి..

పృథ్వీ షా మాదిరిగానే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎక్కువ ధర పెడితే తనను ఎవరూ వేలంలో కొనరని భయపడ్డాడు. అందుకే తన ప్రారంభ ధరను రూ.75 లక్షలుగా ఉంచాడు. గతసారి కూడా సర్ఫరాజ్ అమ్ముడుపోలేదు. అప్పుడు తన ధరను కేవలం 50 లక్షల రూపాయలుగా ఉంచాడు. అయితే, ఈసారి టీమ్ఇండియా తరపున అరంగేట్రం చేసినప్పటికీ టీ20 ఫార్మాట్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..