
IPL 2026 : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక గెలుపు తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చిన ఆమె తన జట్టు ఆటగాడు ప్రియాన్ష్ ఆర్యపై సరదాగా పంచ్ విసరడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది ఒక భారతీయుడికి ఐపీఎల్ లో అత్యధిక స్కోరు. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ ఛేదిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26 బంతుల్లో 76), ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43) పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. చివర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71) ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంజాబ్‌కు 6 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందించారు.
మ్యాచ్ గెలిచిన వెంటనే మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా ఆటగాళ్లను అభినందించారు. ఈ క్రమంలో యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమె సరదాగా అతడి భుజంపై ఒక పంచ్ విసిరారు. దానికి ప్రియాన్ష్ కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసిన కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందిస్తూ.. ఓహ్, అది మంచి పంచ్ అంటూ నవ్వులు పూయించారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 @PunjabKingsIPL 🔥🔥
Red-hot #PBKS register the Highest Successful Run-Chase in #TATAIPL history ❤️
Captain Shreyas Iyer remained unbeaten on 7⃣1⃣ to see his side over the line 🫡
Scorecard ▶️ https://t.co/0oSkMZgNAV#KhelBindaas | #DCvPBKS pic.twitter.com/3dVwbjbGV0
— IndianPremierLeague (@IPL) April 25, 2026
ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో జట్టు సమష్టిగా రాణిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు భయం లేకుండా బ్యాటింగ్ చేస్తుండటం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఢిల్లీపై సాధించిన ఈ విజయం పంజాబ్ కింగ్స్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ ఇప్పుడు అందరికంటే ముందు వరుసలో నిలిచింది.
ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ చేసిన 152 పరుగులు ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అంతకుముందు క్రిస్ గేల్ (175), మెకల్లమ్ (158) మాత్రమే రాహుల్ కంటే ముందున్నారు. అయితే రాహుల్ సెంచరీ వృథా కావడం ఢిల్లీ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. నితీష్ రాణా (91)తో కలిసి రాహుల్ చేసిన 220 పరుగుల భాగస్వామ్యం కూడా ఓటమిని తప్పించలేకపోయింది. పంజాబ్ బ్యాటర్ల సునామీ ముందు ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి