SA vs IND 1st T20I: సౌతాఫ్రికాపై బరిలోకి దిగే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11 నుంచి ఆ ముగ్గురు ఔట్?

India Predicted Playing XI vs South Africa 1st T20I: ఇప్పటికే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన మరో విజయం కోసం ఎదురు చూస్తుండగా, స్వదేశంలో సిరీస్ ఓడేందుకు సౌతాఫ్రికా సిద్ధంగా లేదు. దీంతో నేటి మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతోంది. అయితే, తొలి టీ20లో ఎవరు ఆడాతరనే దానిపై కోచ్‌తోపాటు కెప్టెన్‌కు తలనొప్పిలా తయారైంది.

SA vs IND 1st T20I: సౌతాఫ్రికాపై బరిలోకి దిగే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11 నుంచి ఆ ముగ్గురు ఔట్?
Sa Vs Ind 1st T20i Playing

Updated on: Dec 10, 2023 | 12:20 PM

South Africa vs India 1st T20I: భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. వీటిలో డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన మరో విజయం కోసం ఎదురు చూస్తుండగా, స్వదేశంలో సిరీస్ ఓడేందుకు సౌతాఫ్రికా సిద్ధంగా లేదు. దీంతో నేటి మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతోంది. అయితే, తొలి టీ20లో ఎవరు ఆడాతరనే దానిపై కోచ్‌తోపాటు కెప్టెన్‌కు తలనొప్పిలా తయారైంది.

ప్రపంచ కప్ తర్వాత శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వంటి కొంతమంది ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడంతో, మెన్ ఇన్ బ్లూ చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో పాటు గందరగోళం నెలకొంది. గిల్‌ వెనక్కి రావడంతో ఏ ఓపెనర్‌ను డ్రాప్ చేయాలనేది భారత్‌ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

రుతురాజ్ గైక్వాడ్ నంబర్ 3 బ్యాట్స్‌మెన్ కావొచ్చు. అయితే శ్రేయాస్ అయ్యర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి, ఏ క్రమంలో చూడాల్సి ఉంది. గైక్వాడ్ ప్లేయింగ్ 11లో ఆడతాడా లేదా అనేది చూడాలి. మిడిల్ ఆర్డర్ కూడా అయోమయంలో పడింది. అలాగే, నంబర్ 5 లో ఆడేది ఎవరో కూడా తేలాల్సి ఉంది.

శ్రేయాస్ అయ్యర్ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకూ సింగ్ లు 5వ ర్యాంక్ కోసం పోరాడుతున్నారు. భారత్‌కు కీపర్ అవసరం కావడంతో జితేష్ శర్మ, ఇషాన్ కిషన్‌లో ఎవరిని ఆడిస్తారో కూడా చూడాల్సి ఉంది.

కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌ల పరిస్థితి అలానే ఉంది. ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో బిష్ణోయ్ అత్యుత్తమ ప్రదర్శన చేయగా, ప్రపంచకప్‌లో కుల్దీప్ యాదవ్ ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో.. బిష్ణోయ్‌కి ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. అలాగే, మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగనున్నారు.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..