- Telugu News Photo Gallery Cricket photos Team India All Rounder Hardik Pandya May Return For Afghanistan Series Says BCCI Secretary Jay Shah
Hardik Pandya Fitness: హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై జైషా కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
BCCI Secretary Jay Shah: ప్రపంచకప్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పునరాగమనంపై బీసీసీఐ సెక్రటరీ జే షా పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. దీని గురించి జైషా మాట్లాడుతూ, రాబోయే టీ20 సిరీస్‌లో పాండ్యా తిరిగి జట్టులోకి రావచ్చని తెలిపారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ నుంచి తిరిగి జట్టుతో చేరనున్నట్లు హింట్ ఇచ్చారు.
Updated on: Dec 10, 2023 | 12:43 PM

ప్రపంచకప్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పునరాగమనంపై బీసీసీఐ సెక్రటరీ జైషా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీని గురించి జైషా మాట్లాడుతూ.. రాబోయే టీ20 సిరీస్‌లో పాండ్యా తిరిగి జట్టులోకి రావొచ్చని ప్రకటించాడు.

జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉండవచ్చని జైషా పీటీఐకి తెలిపారు.

భారత్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11, 14, 17 తేదీల్లో ఇరు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

2023 ప్రపంచకప్ సమయంలో పాండ్యా గాయపడ్డాడు. దీంతో అతను మొత్తం టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. డిసెంబర్ 10 నుంచి జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక కాలేదు.

వాస్తవానికి, 2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు.

హార్దిక్ పాండ్యా జట్టు నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అలాగే హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు సూర్య కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు ఇదే ఏకైక టీ20 సిరీస్.




