- Telugu News Photo Gallery Cricket photos No Decision On Rohit Sharma’s Captaincy For T20 World Cup 2024 Says BCCI Chief Jay Shah
T20 World Cup: టీ20 ప్రపంచకప్ నుంచి రోహిత్ శర్మ ఔట్? కీలక ప్రకటనతో షాక్ ఇచ్చిన జైషా..
Rohit Sharma Captaincy: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఇప్పటికే వర్తలు జోరందుకున్నాయి. మాజీలు కూడా హిట్‌మ్యాన్‌నే ఉంచాలని కోరుతున్నారు. కానీ, తాజాగా బీసీసీఐ సెక్రటరీ జే షా మాత్రం రోహిత్ టీ20 ప్రపంచకప్ ఆడటంపై కీలక ప్రకటన చేశారు. దీంతో అభిమానుల్లోనూ ఆందోళన మొదలైంది.
Updated on: Dec 10, 2023 | 11:19 AM

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జట్టు నుంచి నిష్క్రమించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాలో జరగనున్న టెస్టు సిరీస్‌తో మళ్లీ జట్టులో చేరనున్నారు.

కాగా, ఈ ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లో ఎప్పుడు కనిపిస్తారనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ నుంచి విరాట్ కోహ్లీని తప్పించాలని బీసీసీఐ ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి.

అయితే, రోహిత్ శర్మ ఆటతీరుపై సస్పెన్స్ అలాగే ఉంది. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు రోహిత్ శర్మ ఆడడంపై బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక సమాచారం అందించారు.

నివేదికల ప్రకారం, వచ్చే ఏడాది వెస్టిండీస్, USAలలో జరిగే T20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో భాగమవుతాడా లేదా అనేది ఇంకా అస్పష్టంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ స్థానం గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని జైషా ధృవీకరించినట్లు సమాచారం.

ఐపీఎల్, ప్రపంచకప్ కంటే ముందు జరిగే టీ20 సిరీస్‌ల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని జైషా తెలిపారు. ఇప్ప టికే క్లారిటీ రావాల్సి ఉన్నా.. రోహిత్ కెప్టెన్సీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాది అంటే జూన్ 2024లో ప్రారంభమవుతుంది. అంతకు ముందు ఐపీఎల్, ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లు ఉన్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల్లో ఆటగాళ్లు బాగా రాణించాల్సిందేనని షా ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.

ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఫైనల్ చేరింది. కానీ టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే రోహిత్ శర్మ తన పేరుకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు.

రోహిత్ శర్మ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్, అంతర్జాతీయ సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గత రెండు ఐపీఎల్ ఎడిషన్లలో రోహిత్ శర్మ ఫామ్ అంతగా బాగోలేదు.




