- Telugu News Photo Gallery Cricket photos From Bhuvaneshwar Kumar R Ashwin these 5 bowlers most wickets in ind vs sa t20is
IND vs SA T20I Stats: భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్ల హీరోలు వీరే.. టాప్ 5లో భారత్ నుంచి ముగ్గురు..
IND vs SA T20I: భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20I Series) జరగనుంది. వీటితోపాటు కరేబీయన్ గడ్డపై భారత్ 3 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ కూడా ఆడనుంది. టీ20 సిరీస్ విషయానికి వస్తే… వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ (ICC) టీ20 ప్రపంచకప్ కంటే ముందు భారత జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకం.
Updated on: Dec 09, 2023 | 1:01 PM

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లు ఎవరో తెలుసుకోండి..

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ 12 మ్యాచ్‌లలో 18.50 బౌలింగ్ సగటు, 6.69 ఎకానమీ రేటుతో 14 వికెట్లు తీశాడు.

భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆర్ అశ్విన్ నిలిచాడు. ఈ భారత స్పిన్నర్ 10 మ్యాచ్‌లలో 26.18 బౌలింగ్ సగటు, 7.20 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడి మూడో స్థానంలో ఉన్నాడు. కేవలం 5 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశాడు. ఈ కాలంలో, ఎన్‌గిడి బౌలింగ్ సగటు 15.50, ఎకానమీ రేటు 10గా నిలిచింది.

ఈ టాప్-5 జాబితాలో భారత బౌలర్ హర్షల్ పటేల్‌కు చోటు దక్కింది. ప్రొటీస్‌తో జరిగిన 8 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.

ఈ జాబితాలో 9 వికెట్లతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ కూడా చేరాడు. పార్నెల్ భారత్‌తో జరిగిన 11 T20 మ్యాచ్‌లలో బౌలింగ్ సగటు 33.88, ఎకానమీ రేటు 7.65 వద్ద బౌలింగ్ చేశాడు.




