AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes Series 2021-22: సిడ్నీ టెస్ట్ ‘పింక్’ బాల్‌గా ఎందుకు మారిందో తెలుసా?

AUS vs ENG: ఆస్ట్రేలియా గ్రేట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చింది. రెండు రోజుల తర్వాత జరిగే సిడ్నీ టెస్టులో ఈసారి మెక్‌గ్రాత్ కనిపించడు.

Ashes Series 2021-22: సిడ్నీ టెస్ట్ 'పింక్' బాల్‌గా ఎందుకు మారిందో తెలుసా?
Pink Test
Venkata Chari
|

Updated on: Jan 03, 2022 | 10:50 AM

Share

Ashes Series 2021-22: సిడ్నీలో జరగనున్న ‘పింక్ టెస్ట్’కి ముందు, ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలాడు. ఇలాంటి పరిస్థితిలో, అతను ఈసారి ‘పింక్ టెస్ట్’ కోసం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కనిపించడు. గ్లెన్ మెక్‌గ్రాత్‌కు సిడ్నీలో జరిగే ‘పింక్ టెస్ట్’ ఆఫ్ ది ఇయర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నిజానికి, ఈ టెస్ట్ అతని భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఆడుతున్నారు. మెక్‌గ్రాత్ భార్య రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2008లో మరణించింది. అప్పటి నుంచి సిడ్నీలో జరిగే టెస్టును పింక్ టెస్ట్ అని పిలుస్తున్నారు. ఈ టెస్ట్ మూడవ రోజును ‘జేన్ మెక్‌గ్రాత్ డే’ అని పిలుస్తారు.

రొమ్ము క్యాన్సర్ రోగులకు సహాయం చేయడానికి నిధులను సేకరించేందుకుగాను ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సమయంలో జట్టు ఆటగాళ్లు పింక్ క్యాప్‌లో కనిపిస్తారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా ఈసారి సిడ్నీ వేదికగా ఈ ఏడాది ప్రారంభ టెస్టు జరగనుంది. ఈ టెస్టు జనవరి 5 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది.

గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రతి సంవత్సరం ఈ టెస్ట్‌లో ఉంటాడు. కానీ, ఈసారి కరోనా రావడంతో అతను స్టేడియానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జనవరి 5 నాటికి అతని కోవిడ్-19 నివేదిక నెగెటివ్‌గా వస్తే, ఈ టెస్టులో మెక్‌గ్రాత్ హాజరయ్యే అవకాశం ఉంది.

మెక్‌గ్రా ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోలీ మాస్టర్స్, ఆస్ట్రేలియన్ మీడియాతో మాట్లాడుతూ, గ్లెన్ ఇటీవల తన PCR పరీక్ష చేయించుకున్నాడు. అందులో రిపోర్ట్ సానుకూలంగా వచ్చింది. గ్లెన్, అతని కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ తెలిపింది.

Also Read: IND vs SA: విరాట్ కోహ్లీ సెంచరీ కరవు తీరేది అప్పుడే..: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Watch Video: 4 ఓవర్లు.. 3 వికెట్లు.. ఒక మెయిడిన్.. అరంగేట్రంలో అద్భుత బౌలింగ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో