AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Captain: బాబర్‌ బాబర్ ఆజంకు భారీషాక్.. ఒక్క ఫోన్ కాల్‌తో పాక్ కెప్టెన్‌ను మార్చేసిన పీసీబీ చీఫ్?

Babar Azam: కెప్టెన్సీ విషయంలో పాకిస్థాన్‌లో దుమారం రేగింది. ఇకపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా ఉండడంటూ వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్‌లో..

Pakistan Captain: బాబర్‌ బాబర్ ఆజంకు భారీషాక్.. ఒక్క ఫోన్ కాల్‌తో పాక్ కెప్టెన్‌ను మార్చేసిన పీసీబీ చీఫ్?
Babar Azam Pak
Venkata Chari
|

Updated on: Mar 13, 2023 | 10:05 AM

Share

కెప్టెన్సీ విషయంలో పాకిస్థాన్‌లో దుమారం రేగింది. ఇకపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా ఉండడంటూ వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్‌లో షహీన్ షా ఆఫ్రిదికి పీసీబీ కెప్టెన్సీని అప్పగించవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ, షాహీన్ షా అఫ్రిదీ మధ్య ఫోన్ సంభాషణ కూడా జరిగిందంట. పీఎస్‌ఎల్‌ లీగ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న షాహీన్ ప్రస్తుతం లాహోర్ క్వాలండర్స్ కమాండ్‌ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

‘పీసీబీ ఛైర్మన్ షాహీన్ అఫ్రిదీతో ఫోన్‌లో మాట్లాడి పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ఉండమంటూ ఆఫర్ చేశాడు’ అని డైలీ పాకిస్థాన్ పేర్కొంది. నజం సేథి నుంచి వచ్చిన ఈ ఆఫర్‌ను షాహీన్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది.

ఫోన్‌లో మాట్లాడి, చేతిలో కెప్టెన్సీ పెట్టేసిన పీసీబీ ఛీప్..

నజామ్ సేథీ ఫోన్‌లో షాహీన్ షా ఆఫ్రిది ముందు పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉండాలని ప్రతిపాదించగానే, అతను కొంత సమయం తీసుకున్నాడంట. ఆ తర్వాత కెప్టెన్‌గా ఉండటానికి తన సమ్మతిని తెలిపాడని వార్తలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌లో బాబర్ అజామ్‌కు విశ్రాంతి ఇవ్వాలని పీసీబీ భావిస్తున్నట్లు నివేదికలలో పేర్కొన్నారు. దీంతో షాహీన్ పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించవచ్చని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మారనున్న పాక్ సారథి..

బాబర్ అజామ్‌కు దీనిపై ఇంకా సమాచారం లేదు. ఈ మొత్తం అంశంపై ఆయన తన స్పందనను తెలియజేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనను లైమ్‌లైట్‌లో ఉంచుతోందని బాబర్ ఆరోపించారు. షాహీన్ షా అఫ్రిదీని కెప్టెన్‌గా చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఈ విషయాన్ని పీసీబీ తనకు చెప్పాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌..

లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు పాకిస్థాన్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో సైమ్ అయూబ్, ఆజం ఖాన్, ఎహ్సానుల్లాబ్, ఇమాద్ వసీం కూడా ఎంపికైనట్లు సమాచారం. రెండు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ మార్చి 24 నుంచి ప్రారంభం కానుంది. రెండో, మూడో మ్యాచ్‌లు మార్చి 26, 27 తేదీల్లో యూఏఈలోని షార్జాలో జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..