ట్రైన్ జర్నీలో క్రికెటర్‌కు ఊహించని షాక్.. బ్యాగ్ మాయం చేసిన దొంగలు.. ఎంత నష్టం జరిగిందంటే?
Ben Stokes: ఐపీఎల్ 2023కి ముందు బెన్ స్టోక్స్‌కు దోపిడీకి గురయ్యాడు. స్టోక్స్ బ్యాగ్‌ను, అందులో ఉన్న సామాన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌కు రైల్వే స్టేషన్‌లో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
ఐపీఎల్ 2023కి ముందు బెన్ స్టోక్స్‌కు దోపిడీకి గురయ్యాడు. స్టోక్స్ బ్యాగ్‌ను, అందులో ఉన్న సామాన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్‌కు రైల్వే స్టేషన్‌లో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అది కూడా అతని స్వంత దేశంలోనే కావడం గమనార్హం. దీని గురించి బెన్ స్టోక్స్ స్వయంగా ట్వీట్ చేసి సమాచారం అందించారు.
ఈ ఘటన లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో జరిగిందంట. ఆ తర్వాత అతను కాస్త కలత చెందాడు. సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, “కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో నా బ్యాగ్‌ను ఎవరు దొంగిలించారో, వారికి నా బట్టలు లూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు.
నష్టం ఎంత జరిగిందో స్పష్టంగా తెలియదు?
అయితే, ఈ చోరీలో స్టోక్స్‌కు ఎంత నష్టం జరిగిందనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. రూ. 16.25 కోట్లు వెచ్చించి చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆల్ రౌండర్‌ను దక్కించుకుంది. IPL 2023లో ఆడేందుకు బెన్ స్టోక్స్ త్వరలో భారత్‌కు రానున్నాడు. సీజన్ మొత్తానికి CSKకి స్టోక్స్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ప్రకారం, ఈ సీజన్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని బీసీసీఐ నుంచి తమకు హామీ లభించిందని చెప్పుకొచ్చాడు.
స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ టెస్టు జట్టు సక్సెస్..
To who ever stole my bag at King’s Cross train station. I hope my clothes are to big for you ya absolute ****** ?
— Ben Stokes (@benstokes38) March 12, 2023
31 ఏళ్ల బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో, ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రాగా ముగించింది. అయితే, పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. ఇంగ్లండ్‌ను టీ20 ఛాంపియన్‌గా మార్చడంలో స్టోక్స్ తన వంతు పాత్ర పోషించాడు. స్టోక్స్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ అతను ఫిట్‌నెస్‌తో కూడా పోరాడుతున్నాడు. ఐపీఎల్ 2023లో అతను ఆడటంపై ఉత్కంఠ రేగడానికి ఇదే కారణంగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..