పాకిస్థానీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తన వివాహ జీవితం గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ మరోసారి పెళ్లి చేసుకునే అవసరం తనకు లేదని స్పష్టం చేశాడు. “నేను ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకున్నాను. నా భార్యతో చాలా సంతోషంగా ఉన్నాను, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు సార్లు పెళ్లి చేసుకోవడం మత పరంగా సాధ్యమే కానీ, నాకు నా భార్యతో జీవితంలో అన్నీ సరిపోతున్నాయి,” అని షెహజాద్ యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో తెలిపారు.
తన చిన్ననాటి స్నేహితురాలు సనా అహ్మద్‌ను 2015లో వివాహం చేసుకున్న షెహజాద్, తన భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యమని పేర్కొన్నాడు. మీ జీవిత భాగస్వామి మంచిది అయితే, వారికీ విలువ ఇవ్వాలిఅని మతం అనుమతించినా మీరు కొత్త సంబంధాలు నిర్మించకూడదు అని,ఇది హృదయాన్ని ముక్కలు చేయడంతో సమానం అంటూ తన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వివరించాడు.
క్రికెట్ విషయానికి వస్తే, షెహజాద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు లేకుండా పోయాడు. చివరిసారిగా 2019లో టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత, అతను క్రికెట్‌కు దూరంగా ఉంటూ తన దృష్టిని యూట్యూబ్ కెరీర్ వైపు మళ్లించాడు. క్రికెట్ విశ్లేషణ వీడియోలు చేసుకుంటూ, పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై పలు విమర్శలు చేస్తూ, అభిమానులతో సమానమైన చర్చలకు దారితీస్తున్నాడు.