PAK vs ENG: 19 బంతుల్లోనే ఘన విజయం.. 3 ఏళ్ల తర్వాత తొలి సిరీస్ గెలిచిన పాక్

PAK vs ENG: సాజిద్ ఖాన్, నోమన్ అలీల విధ్వంసంతో ఇంగ్లండ్ మూడవ టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ మూడేళ్ల తర్వాత స్వదేశంలో తన మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. బాబర్ ఆజం లేకుండానే పాక్ జట్టు ధీటుగా సమాధానిచ్చింది. సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.

PAK vs ENG: 19 బంతుల్లోనే ఘన విజయం.. 3 ఏళ్ల తర్వాత తొలి సిరీస్ గెలిచిన పాక్
Pak Vs Eng 3rd Test
Follow us

|

Updated on: Oct 26, 2024 | 1:02 PM

PAK vs ENG: ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్, ఇంగ్లండ్‌తో టెస్టు జట్టులో పెద్ద మార్పు చేసింది. తొలి టెస్టులో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్ సాజిద్ ఖాన్ (10 వికెట్లు), నోమన్ అలీ (9 వికెట్లు) రూపంలో ఇద్దరు స్పిన్నర్లను జట్టులో చేర్చుకుంది. ఈ ఇద్దరు స్పిన్నర్లు కలిసి ఇంగ్లీష్ బేస్‌బాల్‌ను నాశనం చేశారు. రావల్పిండి టెస్టు మ్యాచ్ మూడో రోజు సాజిద్ ఖాన్, నోమన్ అలీ కలిసి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను 112 పరుగులకు కుదించారు. దీంతో 36 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో సులువుగా గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకున్న పాకిస్థాన్ 2005-06 తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ను ఓడించడం ఇదే తొలిసారి. మూడో టెస్టులో సాజిద్ 10 వికెట్లు, నోమన్ అలీ 9 వికెట్లు తీశారు.

సాజిద్‌, నోమన్‌ల ముందు ఇంగ్లండ్‌ ఖేల్ ఖతం..

నిజానికి ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మూడో రోజు కూడా ఇంగ్లండ్ వికెట్ల పతనం ఆగలేదు, సాజిద్, నోమన్ కలిసి తమ రెండో ఇన్నింగ్స్‌ను కేవలం 112 పరుగులకే కుదించారు. దీంతో పాకిస్థాన్‌కు కేవలం 36 పరుగుల విజయలక్ష్యం లభించింది.

పాకిస్థాన్ 19 బంతుల్లో విజయం..

36 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ సామ్ అయూబ్ (5) తొందరగానే నిష్క్రమించాడు. దీంతో పాటు పాక్ కెప్టెన్ షాన్ మసూద్ కేవలం ఆరు బంతుల్లో 23 పరుగులు చేసి 3.1 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో జట్టును గెలిపించాడు. తద్వారా మూడేళ్ల తర్వాత పాకిస్థాన్ తొలి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 18 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలైంది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్‌ తరపున సౌద్ షకీల్ 223 బంతుల్లో 5 ఫోర్లతో 134 పరుగులు చేశాడు. షకీల్ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసి 77 పరుగుల ఆధిక్యం సాధించి ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..