AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : పాకిస్థాన్‎కు అంత సీన్ లేదు.. ఫైనల్‎కు వచ్చే ఛాన్సే లేదు.. సొంత ప్లేయరే షాకింగ్ కామెంట్స్

ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఆడతాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఫైనల్‌లో ఏ జట్లు ఆడతాయని అందరూ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం, ఈసారి పాకిస్తాన్ ఫైనల్‌కు చేరదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Asia Cup 2025 :  పాకిస్థాన్‎కు అంత సీన్ లేదు.. ఫైనల్‎కు వచ్చే ఛాన్సే లేదు.. సొంత ప్లేయరే షాకింగ్ కామెంట్స్
Danish Kaneria
Rakesh
|

Updated on: Aug 28, 2025 | 3:32 PM

Share

Asia Cup 2025 : ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని 2 గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో 4 జట్లు) విభజించారు. టోర్నమెంట్‌ ప్రారంభం కావడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో, క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టోర్నమెంట్‌పై తమ అంచనాలు వేస్తున్నారు. అయితే, ఆసియా కప్ ఫైనల్‌లో ఏ రెండు జట్లు తలపడతాయి? అనే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన అంచనా అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని ప్రకారం.. ఈసారి పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోదు. మరి, ఫైనల్‌లో భారత్‌తో తలపడే జట్టు ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనల్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్?

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తప్పకుండా సూపర్-4కి చేరుకుంటాయని అందరూ భావిస్తున్నారు. గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఒకవేళ రెండూ సూపర్-4కు చేరితే, సెప్టెంబర్ 21న మరోసారి తలపడే అవకాశం ఉంది. కానీ, దానిష్ కనేరియా మాత్రం పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోదని అంచనా వేశాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల గురించి చర్చిస్తూ కనేరియా ఈ సంచలన ప్రకటన చేశాడు. అతని ప్రకారం, ఈసారి ఆసియా కప్ ఫైనల్ భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య జరగవచ్చు. పాకిస్తాన్ జట్టుపై కేవలం కనేరియా మాత్రమే కాదు.. బాసిత్ అలీ లాంటి మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేశారు.

దానిష్ కనేరియా మాట్లాడుతూ.. “భారత జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి కూడా టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారు. అయితే, ఈసారి ఆఫ్ఘనిస్తాన్ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నా అంచనా ప్రకారం, ఆసియా కప్ ఫైనల్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగవచ్చు. పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ ఒక పెద్ద సవాలును విసురుతుంది” అని అన్నాడు.

పాకిస్తాన్‌ను భారత్ సులభంగా ఓడిస్తుంది

దానిష్ కనేరియా సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి కూడా అంచనా వేశాడు. భారత జట్టును మెచ్చుకుంటూ, “ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది, కానీ భారత జట్టు పాకిస్తాన్‌ను చాలా సులభంగా ఓడిస్తుందని నేను నమ్ముతున్నాను. భారత జట్టులో చాలా బలంగా ఉంది. కాబట్టి టైటిల్ గెలవడానికి కూడా భారత్ బలమైన పోటీదారు” అని అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు