Asia Cup 2023 Pakistan vs Nepal Highlights: తొలి మ్యాచ్‌లో తడబడిన నేపాల్.. పసికూనపై పాక్‌దే విజయం..
Asia Cup 2023 PAK vs NEP match Highlights in Telugu: తొలి మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై పాక్ భారీ తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్‌లో తొలిసారిగా ఆడుతున్న నేపాల్ జట్టు.. పాక్ ఇచ్చిన 343 పరుగుల టార్గెట్‌ని చేధించలేకపోయింది. 104 పరుగులకే పరిమితమై పాక్ చేతిలో 238 పరుగుల తేడాతో తన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి..
Asia Cup 2023 Opening Ceremony Live: పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా కప్ టోర్నీ తొలి మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై పాక్ భారీ తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్‌లో తొలిసారిగా ఆడుతున్న నేపాల్ జట్టు.. పాక్ ఇచ్చిన 343 పరుగుల టార్గెట్‌ని చేధించలేకపోయింది. 104 పరుగులకే పరిమితమై పాక్ చేతిలో 238 పరుగుల తేడాతో తన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఈ క్రమంలో బాబర్ అజామ్ 151, ఇఫ్తికర్ అహ్మద్ 109* సెంచరీలు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. అలాగే నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి 2 వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లమిచానే చేరో వికెట్ పడగొట్టారు.
పాక్ ఇచ్చిన భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్ జట్టుకు ప్రారంభం నుంచే తడబడింది. ఈ క్రమంలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా.. ఆరీఫ్ షేక్ 26, సోంపాల్ కామి 28 పరుగులతో కొంత సేపు నిలకడగా రాణించిన ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. వీరిద్దరు వెనుదిరిగన తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. ఫలితంగా పాకిస్తాన్ భారీ తేడాతో ఆసియా కప్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకోంది. ఇక పాక్ బౌలర్లలో షబాద్ ఖాన్ 4, షాహీన్ అఫ్రిదీ 2, హారిస్ రవుఫ్ 2, నసీమ్ షా 1, మహ్మద్ నవాజ్ ఓ వికెట్ తీశాడు.
Pakistan begin #AsiaCup2023 with a BIG win 🇵🇰
Nepal found it tough against that quality #PAKvNEP
👉 https://t.co/eh4HEwWBH0 pic.twitter.com/Dj01dzpNfD
— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2023
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు..
Pakistan won the all-important toss and have elected to bat first!
Will Pakistan’s opening batsmen weather the storm and set a formidable total? Or will Nepal’s bowlers shine brightly in their maiden Asia Cup outing? 🤩💪#AsiaCup2023 #PAKvNEP pic.twitter.com/E9Zf1zzddN
— AsianCricketCouncil (@ACCMedia1) August 30, 2023
పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి
LIVE NEWS & UPDATES
-
ఆశలు వదిలేసినట్లే..!
పాకిస్తాన్ ముందు పసికూన నేపాల్ పరిస్థితి ఓటమి దరికి చేరినట్లుగానే ఉంది. పాకిస్తాన్ ఇచ్చిన 343 పరుగుల టార్గెట్‌ని నేపాల్ బ్యాటర్లు చేధించడం ఏమో కానీ తమ కంటే సీనియర్ బౌలర్ల ముందు నిలకలేకపోతున్నారు. 91 పరుగులకే 8 వికెట్లను కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకున్నట్లే అని అనధికారికంగా ప్రకటించారు నేపాలీలు.
-
82 పరుగులకే 5 వికెట్లు..
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయానికి దగ్గరవుతోంది. పాక్ ఇచ్చిన 343 పరుగుల టార్గెట్‌ని చేధించే క్రమంలో నేపాల్ జట్టు 82 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. క్రీజులో మిడిలార్డర్ ప్లేయర్లు గుల్సన్ ఝా 12, దీపేందర్ సింగ్ 2 పరుగులతో ఉన్నప్పటికీ.. చేధన ఆసాధ్యమే అనే పరిస్థితి ఏర్పడింది.
-
-
మరో వికెట్ డౌన్..
ప్రప్రథమంగా ఆసియా కప్ టోర్నీ ఆడుతున్న నేపాల్ జట్టు తన తొలి మ్యాచ్‌లోనే కష్టపడుతోంది. తొలి ఒవర్‌లోనే ఓపెనర్ కుషల్(8), కెప్టెన్ రోహిత్ పౌడెల్(0) వెనుదిరగ్గా.. రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ ఆరీష్ షేక్(5) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఆరీష్ షేక్ నిలకడగా ఆడుతున్నాడు అనుకునే లోపులోనే 26 పరుగులతో బౌల్డ్ అయ్యాడు. దీంతో నేపాల్ 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సోంపాల్ కామి 28, గుల్సన్ ఝా 8 పరుగులతో ఉన్నా వారి ఎదుట 261 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
-
ఆసాధ్యమే కానీ తలొగ్గమంటోన్న నేపాల్..
అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నేపాల్ ముందు పాకిస్తాన్ కొండంత టార్గెట్‌ని ఉంచింది. 343 పరుగుల టార్గెట్ సీనియర్ జట్లకు కొన్ని సందర్భాల్లో చేధించడం అసాధ్యం. అలాంటి టార్గెట్‌ని సాధించకున్నా, చివరి వరకు ప్రయత్నిస్తామని క్రీజులో నిలకడగా ఆడుతున్నారు నేపాల్ బ్యాటర్లు. 14 ఓవర్ల ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టంలో నేపాల్ 72 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆరీఫ్ షేక్ 25, సోంపాల్ కామి 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
అప్పుడే రెండు వికెట్లు..
పాకిస్తాన్ ఇచ్చిన 343 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్ తన ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లో.. నేపాల్ ఓపెనర్ కుషల్ భుర్తల్(8), మూడో నెంబర్‌లో వచ్చిన కెప్టెన్ రోహిత్ పౌడెల్(0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో తొలి ఓవర్ నుంచి నేపాల్‌కి కష్టాలు ప్రారంభమైనట్లు ఉంది.
-
-
నేపాల్ ఎదుట భారీ టార్గెట్.. ఛేదన సాధ్యమేనా..?
ఆసియా కప్ టోర్నమెంట్‌ను తొలిసారిగా ఆడుతున్న నేపాల్‌కి తొలి మ్యాచ్‌లోనే కొండంత కష్టం వచ్చింది. పాక్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బాబర్ సేన నేపాల్‌కి ఏకంగా 342 పరుగుల టార్గెట్‌ని విసిరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగులు కూడా నేర్చుకోని నేపాల్ జట్టు ఈ కొండంత కష్టాన్ని అధిగమిస్తే ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించినట్లే..
Iftikhar Ahmed's maiden ODI 💯is the cherry on the cake!
An epic, blistering partnership with Babar Azam as Pakistan finish at 342-6 against Nepal #PAKvNEP #AsiaCup
👉 https://t.co/eh4HEwWBH0 pic.twitter.com/8tCsg1k64o
— ESPNcricinfo (@ESPNcricinfo) August 30, 2023
-
భారీ స్కోర్ దిశగా పాక్..
ఆసియా కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌ని నేపాల్‌తో ఆడుతున్న పాక్ భారీ స్కోర్ దిశగా నడుస్తోంది. 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్‌కి బాబర్ అజామ్, ఇఫ్తికర్ అహ్మద్ బలమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో బాబర్ 131, అహ్మద్ 73 పరుగులతో క్రీజులో ఉండగా.. పాక్ 4 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. పాక్‌కి ఇంకా 4.4 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఈ క్రమంలో నేపాల్ టార్గెట్ 300 పరుగులకు పైగానే ఉంటుంది.
-
సెంచరీకి చేరువలో బాబర్..
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా పాక్, నేపాల్ మధ్య జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో బాబర్ అజామ్ సెంచరీకి చేరువయ్యాడు. మూడో నెంబర్‌లో వచ్చిన బాబర్ ప్రస్తుతం 97 పరుగుల వద్ద ఉన్నాడు.
-
4 వికెట్లు తీసిన పసికూన..
పసికూనల ముందు పాక్ నిలబడలేకపోయిందో, లేక పాక్‌పై పసికూనల ప్రతాపమో కానీ.. నేపాల్ బౌలర్లు ఆసియా కప్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్ 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) వెంటనే వెనుదిరగగా, అనంతరం మహ్మద్ రిజ్వాన్(44), అఘా సల్మాన్(5) కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం పాక్ స్కోర్ 139 పరుగులు కాగా, బాబర్ అజామ్ 61, ఇఫ్తిఖర్ అహ్మద్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
25 పరుగులకే 2 వికెట్లు.. పాక్ ప్రస్తుత స్కోర్ ఎంతంటే..?
పాక్ ముందు పసికూనగా రంగంలోకి దిగిన నేపాల్ జట్టు ఆకట్టుకుంటోంది. 25 పరుగులకే ఫఖార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) రూపంలో ఇద్దరు ప్లేయర్లను పెవిలియన్‌కు పంపింది. అయితే అనంతరం వచ్చిన బాబర్ అజామ్(16*), మహ్మద్ రిజ్వాన్(24*) నిలకడగా రాణిస్తున్నారు. దీంతో 14 ఓవర్ల ఆటలో పాకిస్తాన్ 2 వికెట్లను కొల్పోయి 65 పరుగులు చేసింది.
-
టాస్ గెలిచిన పాక్..
ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఆసియా కప్ 2023 టోర్నీ తొలి మ్యాచ్‌లో పాక్, నేపాల్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టాస్ గెలిచిన పాక్, ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
🚨 T O S S A L E R T 🚨
Pakistan win the toss and elect to bat first 🏏#PAKvNEP | #AsiaCup2023 pic.twitter.com/iuuZfKfQv1
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
-
లిట్టన్ దాస్ ఔట్..
అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఆసియా కప్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ జట్టులో అనాముల్ హక్ చోటు దక్కించుకున్నాడు.
-
హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్..
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్ నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సూపర్ ఫోర్, ఆసియా కప్ ఫైనల్‌తో సహా మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
-
నేపాల్‌తో మ్యాచ్‌కు పాక్ జట్టు..
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హారిస్ రవూఫ్.
-
తొలి రెండు మ్యాచ్‌లు ఆడని రాహుల్..
గాయం తర్వాత తిరిగి జట్టులోకి వస్తున్న రాహుల్ ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. కాబట్టి అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలున్నాయి.
-
లంకకు చేరిన భారత ఆటగాళ్లు..
Star Boy Tilak Varma with a selfie..!!!
– Maiden ODI tour in his career. pic.twitter.com/uhnb86CubH
— Johns. (@CricCrazyJohns) August 30, 2023
-
ఈవెంట్‌లో పాల్గొననున్న స్టార్లు..
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు ఏఆర్ రెహమాన్, అతిఫ్ అస్లాం ప్రదర్శన ఇవ్వనున్నారు. సాంప్రదాయ ఆసియా సంగీతం, నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి.
-
లంకకు చేరిన టీమిండియా..
ఈరోజు ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం రోహిత్ నేతృత్వంలోని టీమిండియా ఈ ఉదయం బెంగళూరు నుంచి శ్రీలంకకు బయలుదేరి వెళ్లింది. ఈరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు కొలంబోలో దిగిన టీమిండియా.. అక్కడి నుంచి క్యాండీకి బయలుదేరుతుంది.
-
మరికొద్ది నిమిషాల్లో ప్రారంభోత్సవం..
ఆసియా కప్ ప్రారంభ వేడుకలు ముల్తాన్‌లోని ముల్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది.
Published On - Aug 30,2023 1:21 PM