Watch Video: భారత ఆటగాడి వికెట్.. కట్‌చేస్తే.. పీక్స్‌కు చేరిన పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో..
Pakistan Pacer Mohammad Zeeshan Aggressive Celebration: అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరపున అజాన్ అవైస్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను 130 బంతుల్లో పది ఫోర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. భారత్‌పై పాకిస్థాన్ అద్భుత విజయంపై ట్విట్టర్‌లో విపరీతమైన స్పందన వస్తోంది.
U19 Asia Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ పోటీ ఏ స్థాయిలో ఆడినా ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆదివారం జరిగిన అండర్-19 ఆసియా కప్ 2023 మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. అండర్-19 ఆసియా కప్ (U19 Asia Cup 2023) ఐదవ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఇందులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో భారత్ (IND vs PAK)ని ఓడించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉదయ్ సహారన్ సారథ్యంలోని భారత జట్టుకు శుభారంభం లభించలేదు. దీంతో ఆ జట్టు స్కోరు 46 వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్ (62), సహారన్ (60), సచిన్ దాస్ (58) అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 47 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరఫున అజాన్ అవైస్ అద్భుత సెంచరీ ఆడాడు. అతను 130 బంతుల్లో పది ఫోర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. భారత్‌పై పాకిస్థాన్ అద్భుత విజయంపై ట్విట్టర్‌లో విపరీతమైన స్పందన వస్తోంది.
అయితే, ఈ మ్యచ్‌లో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ జీషాన్ దూకుడైన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ చేతుల్లోకి బంతి చేరడంతో భారత బ్యాటర్ రుద్ర పటేల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. పాకిస్తాన్ పేసర్ ఈ వికెట్‌తో చాలా ఉప్పొంగిపోయాడు. అయితే, అతని భావోద్వేగంతో సెలబ్రేషన్స్ పీక్స్‌కి చేరాయి.
— LePakad7🇮🇳🇮🇹 (@AreBabaRe2) December 10, 2023
12వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రుద్ర కవర్స్ ద్వారా బంతిని కొట్టాలని చూశాడు. కానీ భారత స్టార్ బ్యాట్‌ను ముద్దాడిన తర్వాత బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి చేరింది.
పాకిస్థాన్ U19 ప్లేయింగ్ XI: షామిల్ హుస్సేన్, షాజైబ్ ఖాన్, అజాన్ అవైస్, సాద్ బేగ్(కీపర్/కెప్టెన్), మహ్మద్ జీషన్, మహ్మద్ రియాజుల్లా, తయ్యబ్ ఆరిఫ్, అరాఫత్ మిన్హాస్, అలీ అస్ఫంద్, అమీర్ హసన్, ఉబైద్ షా.
ఇండియా U19 ప్లేయింగ్ XI: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, రుద్ర పటేల్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ముషీర్ ఖాన్, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్ (కీపర్), సౌమీ పాండే, మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని , నమన్ తివారీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..