World Cup 2023: హిందూ దేవుళ్లపై అసభ్య వ్యాఖ్యలు.. కట్‌చేస్తే.. భారత్ నుంచి బహిష్కరణకు గురైన పాక్ జర్నలిస్ట్..

Pakistan Journalist Zainab Abbas: పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు జైనాబ్ అబ్బాస్ ఐసీసీ ప్రపంచకప్ షోను కవర్ చేసేందుకు భారత్ వచ్చింది. కానీ, ఒకప్పుడు చేసిన తీవ్రమైన తప్పులతో ప్రస్తుతం ఆమె భారత్ నుంచి బహిష్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో పాక్ తరపున యాంకర్‌గా వచ్చిన ఆమె.. ప్రస్తుతం షోలు నిర్వహించుకుండానే భారత్ నుంచి మాయమైంది. పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం.

World Cup 2023: హిందూ దేవుళ్లపై అసభ్య వ్యాఖ్యలు.. కట్‌చేస్తే.. భారత్ నుంచి బహిష్కరణకు గురైన పాక్ జర్నలిస్ట్..
Zainab Abbas
Follow us
Venkata Chari

|

Updated on: Oct 09, 2023 | 6:56 PM

పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు జైనాబ్ అబ్బాస్ భారతదేశం నుంచి బహిష్కరణకు గురైంది. ఆమె ఐసీసీ ప్రపంచ కప్ 2023లో యాంకర్‌గా భారత్‌కు వచ్చింది. కానీ, భారతదేశం నుంచి బహిష్కరణకు గురైంది. జైనాబ్‌ అబ్బాస్‌ హిందూ దేవతలను అవమానించినందున ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. జైనబ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

జైనాబ్ అబ్బాస్‌పై భారతీయ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఈ ఫిర్యాదు జైనాబ్ పాత ట్వీట్లకు సంబంధించింది. అందులో ఆమె హిందూ దేవుళ్ళు, దేవతలకు వ్యతిరేకంగా అసభ్యంగా కామెంట్స్ చేసింది. ఫిర్యాదు చేసిన భారతీయ న్యాయవాది ప్రకారం, జైనాబ్ 9 సంవత్సరాల క్రితం “జైనాబ్లోవెస్ర్క్” అనే వినియోగదారు పేరుతో ఈ ట్వీట్లు చేసిందని, దానిని ఆమె తర్వాత “జబ్బాస్ అఫీషియల్”గా మార్చుకుందని తెలిపారు.

జైనాబ్ అబ్బాస్ భారత్ నుంచి బహిష్కరణ..

పాకిస్థాన్ జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్‌పై ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు నమోదైంది. హిందూ విశ్వాసాలను కించపరిచినందుకు ఆమెపై ఐపీసీ 153ఏ, 295, 506, 121 సెక్షన్ల మేరకు కేసు నమోదు చేశారు. వీలైనంత త్వరగా ప్రపంచకప్‌ వ్యాఖ్యాతల జాబితా నుంచి ఆమెను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఎందుకంటే, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే అలాంటి వారిని భారతదేశంలో స్వాగతించలేమంటూ పేర్కొన్నారు.

భారత క్రికెట్‌ను కూడా టార్గెట్ చేసిన జైనాబ్ అబ్బాస్..

జైనాబ్ అబ్బాస్ క్రికెట్ పేరుతో భారత్‌పై కూడా దాడి చేసింది. ఇంత జనాభా ఉన్న ఈ దేశం ఫాస్ట్ బౌలర్‌ను తయారు చేయలేదంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది.

మీడియా నివేదికల ప్రకారం, జైనాబ్ అబ్బాస్ కేసులో ఇప్పుడు తాజా అప్‌డేట్ ఏమిటంటే, పాకిస్తాన్ జర్నలిస్ట్ ICC ప్రపంచ కప్ 2023 నుంచి నిషేధాని గురైంది. అంతేకాకుండా ఆమె భారతదేశం నుంచి వెళ్లింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..