NZ vs NED: తగ్గేదేలే.. బ్యాటింగ్‌లో ఇరగదీసిన కివీస్.. బౌలింగ్‌తో దడ పుట్టించిన నెదర్లాండ్స్.. టార్గెట్ ఎంతంటే?

న్యూజిలాండ్ 50 ఓవర్లలో 322 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నెదర్లాండ్స్ ముందు 323 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ తరపున విల్ యంగ్ 70 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి 51 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ లోథమ్ కూడా 53 పరుగులు చేశాడు. మిచెల్ 48 పరుగులు చేశాడు.

NZ vs NED: తగ్గేదేలే.. బ్యాటింగ్‌లో ఇరగదీసిన కివీస్.. బౌలింగ్‌తో దడ పుట్టించిన నెదర్లాండ్స్.. టార్గెట్ ఎంతంటే?
Nz Vs Ned Score
Follow us
Venkata Chari

|

Updated on: Oct 09, 2023 | 6:45 PM

న్యూజిలాండ్ 50 ఓవర్లలో 322 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నెదర్లాండ్స్ ముందు 323 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ తరపున విల్ యంగ్ 70 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించి 51 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ లోథమ్ కూడా 53 పరుగులు చేశాడు. మిచెల్ 48 పరుగులు చేశాడు.

మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేయగా.. మాట్ హెన్రీ 4 బంతుల్లో 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఐరన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, రీలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో 2 వికెట్లు తీశారు. బాస్ జి లీడే 1 వికెట్ తీశాడు.

కాగా, లాకీ ఫెర్గూసన్ న్యూజిలాండ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. జిమ్మీ నీషమ్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ కూడా ఆడలేదు. న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. నెదర్లాండ్స్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. మంచి సవాల్ విసిరింది. నెదర్లాండ్స్ బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టడంలో సఫలమయ్యారు.

వన్డే క్రికెట్‌లో, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు 4 సార్లు ముఖాముఖి తలపడగా, న్యూజిలాండ్ నాలుగు సార్లు గెలిచింది.

ఇరుజట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

View this post on Instagram

A post shared by ICC (@icc)

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

నెదర్లాండ్స్ టీం ఫీల్డింగ్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..