సఫారీల వేట ముగిసింది!

వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి.. దక్షిణాఫ్రికాను 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ హారిస్‌ సోహైల్‌ (89; 59 బంతుల్లో 9×4, 3×6)  మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (69; 80 బంతుల్లో 7×4), ఇమాముల్‌ హక్‌ (44), ఫకర్‌ జమాన్‌ […]

సఫారీల వేట ముగిసింది!
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jun 24, 2019 | 7:17 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి.. దక్షిణాఫ్రికాను 49 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ హారిస్‌ సోహైల్‌ (89; 59 బంతుల్లో 9×4, 3×6)  మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (69; 80 బంతుల్లో 7×4), ఇమాముల్‌ హక్‌ (44), ఫకర్‌ జమాన్‌ (44) కూడా రాణించారు. అటు సఫారీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. తాహిర్ రెండు.. ఫెలుక్వాయో, మార్‌క్రమ్‌ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మరోసారి చతికిల పడింది. షాదాబ్‌ ఖాన్‌ (3/50), ఆమిర్‌ (2/49), వాహబ్‌ రియాజ్‌ (3/46) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ డుప్లెసిస్‌ (63; 79 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో ఫెలుక్వాయో (46 నాటౌట్‌; 32 బంతుల్లో 6×4) బ్యాట్‌‌ను ఝుళిపించినా.. ఆఖరి ఓవర్లలో పాకిస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో సఫారీలు ఓటమి చవి చూశారు. హారిస్ సోహైల్‌కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ఇది ఐదో పరాజయం. దీంతో సఫారీల వరల్డ్‌కప్ వేట ముగింపుకు వచ్చింది.