AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాకు అఫ్గాన్ సవాల్!

వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో రెండు సంచలన విజయాలు సాధించిన బంగ్లాదేశ్.. భారత్‌కు చెమటలు పట్టించిన ఆఫ్ఘనిస్థాన్‌తో తలబడనుంది. సౌథాంఫ్టన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్న బంగ్లాదేశ్… విండీస్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ 41 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటుకున్నారు. అటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమీమ్ ఇక్బల్, సౌమ్య […]

బంగ్లాకు అఫ్గాన్ సవాల్!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 24, 2019 | 7:16 PM

Share

వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో రెండు సంచలన విజయాలు సాధించిన బంగ్లాదేశ్.. భారత్‌కు చెమటలు పట్టించిన ఆఫ్ఘనిస్థాన్‌తో తలబడనుంది. సౌథాంఫ్టన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్న బంగ్లాదేశ్…

విండీస్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ 41 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటుకున్నారు. అటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమీమ్ ఇక్బల్, సౌమ్య సర్కార్, రహీమ్, షకిబుల్ హాసన్, మహమ్మదుల్లాతో బంగ్లా బ్యాటింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇకపోతే షకిబుల్ హాసన్ ప్రతీ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీ టాప్‌ స్కోరర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ వార్నర్‌ తర్వాత స్థానంలో నిలిచి వారెవ్వా అనిపించుకుంటున్నాడు.

ఆత్మవిశ్వాసంతో ఆఫ్ఘనిస్థాన్…

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ కేవలం 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ ఈ మ్యాచ్ ద్వారా అఫ్గాన్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మాత్రం పెరిగింది. భారత్‌లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో క్రీడా పండితులు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు స్పిన్‌లో మ్యాజిక్‌ చేయడంతో పాటు, బ్యాటింగ్‌లోనూ ఆ జట్టు ఫరవాలేదనిపిస్తోంది.

కాబట్టి ఇవాళ ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Follow Us
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..