పాకిస్థాన్ క్రికెటర్లను చావు దెబ్బ కొట్టిన ప్రధాని మోదీ! ఇక బాబయ్యా అనాల్సిందే..
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై వివిధ ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లు, బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ వంటి క్రికెటర్ల ఖాతాలు, పాకిస్థాన్ ప్రధాని యూట్యూబ్ ఛానెల్‌ను భారతదేశంలో నిషేధించింది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు మరణించారు. ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావించిన భారత ప్రభుత్వం వెంటనే పాకిస్థాన్‌పై తీవ్ర ఆంక్షలు విధించింది. భారత్‌లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపించింది. సరిహద్దులను మూసేసింది, వీసాలు రద్దు చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా పలు తీవ్ర చర్యల తర్వాత.. డిజిటల్ పరంగా కూడా భారత్.. పాక్‌పై చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, మొహమ్మద్ రిజ్వాన్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను కూడా ఇండియాలో బ్యాన్ అయ్యాయి. నిజానికి పాక్ క్రికెటర్లకు రెవెన్యూ పరంగా ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ సోర్స్‌గా ఉంది. ఇప్పుడు ఇండియాలో వాళ్ల అకౌంట్లు బ్లాక్ చేయడంతో వారికి ఇన్‌స్టా నుంచి వచ్చే మనీ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఒకరకంగా ఇది వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే అవుతుంది. అలాగే పాకిస్థాన్ ప్రధాని యూట్యూబ్ ఛానెల్‌పై కూడా మన దేశంలో నిషేధం విధించింది. ఇలా పాక్‌పై వరుస చర్యలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొని ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధం జరగొచ్చు అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.




