మరోసారి కోహ్లీని గెలికిన టీమిండియా మాజీ క్రికెటర్! సూర్యకు హైప్ ఇస్తూ.. కోహ్లీని
సంజయ్ మంజ్రేకర్ మరోసారి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటుపై విమర్శలు చేస్తూ, సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసించారు. కోహ్లీ ఐపీఎల్ 2025లో టాప్ 10 ఆటగాళ్లలో ఉండరని అన్నారు. కోహ్లీ సోదరుడు కూడా మంజ్రేకర్‌పై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ, సూర్యకుమార్, సాయి సుదర్శన్ పోటీ పడుతున్నారు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి విరాట్ కోహ్లీపై ఇన్ డైరెక్ట్‌గా విమర్శ చేశాడు. విమర్శ కూడా కాదు.. ఒక రకంగా హేళన చేశాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. కొన్ని రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు గుప్పిస్తూ.. బుమ్రా వర్సెస్ కోహ్లి ఇకపై బెస్ట్ వర్సెస్ బెస్ట్ కాదని, ఐపీఎల్-2025లో అగ్రస్థానంలో ఉండే పదిమందిలో తానైతే కోహ్లి పేరు చెప్పనని, తన జాబితాలో కోహ్లీ లేడనే మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ అభిమానులు వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా మంజ్రేకర్‌పై విమర్శలు గుప్పించాడు. అయితే తాజాగా ఈ ప్లేయర్‌పై ఆరెంజ్ క్యాప్ మరింత బ్రైట్‌గా కనిపిస్తోంది. అది కూడా 172 స్ట్రైక్ రేట్‌తో అంటూ పేర్కొన్నాడు. గతంలో కోహ్లీపై స్ట్రైక్ రేట్‌పై చేసిన విమర్శను పరోక్షంగా ఇక్కడ ప్రస్తావిస్తూ.. సూర్య స్ట్రైక్‌రేట్‌ను మెచ్చుకున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం సూర్యకుమార్ యాదవ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ కూడా పోటీ పడుతున్నారు. వీరి ముగ్గురి మధ్య ఆరెంజ్ క్యాప్ తరచూ మారుతూ ఉంటుంది. సీజన్ పూర్తి అయ్యాక ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటారో కానీ.. ప్రస్తుతం అయితే ఆరెంజ్ క్యాప్.. ఆటగాళ్ల హెడ్స్‌పై మారుతూ ఉంది. విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగలు చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ ప్రస్తుతం 3వ స్థానంలో అన్నాడు. సాయి సుదర్శన్ 9 మ్యాచ్‌ల్లో 150 స్ట్రేక్ రేట్‌తో 456 పరుగులు చేసి రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సూర్య 11 మ్యాచ్‌లు ఆడి 172.72 స్ట్రేక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు. వీరి మధ్య ఉన్న తేడా తక్కువే.. ఒక్కో మ్యాచ్‌తో ఆరెంజ్ క్యాప్ మారిపోతుంది. స్ట్రేక్ రేట్ విషయంలో సూర్య మెరుగ్గా ఉన్నాడు.
ఎందుకంటే అతను అగ్రెసివ్ ప్లేయర్, అతని బ్యాటింగ్ ఆర్డర్, అతని టీమ్ బ్యాటింగ్ లైనప్ అన్ని దృష్టిలో పెట్టుకొని.. అతను మంచి స్ట్రేక్ రేట్‌తో ఆడాలి. కానీ, కోహ్లీ విషయంలో అలా కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి టైమ్‌లో కోహ్లీ కచ్చితంగా ఒక ఎండ్‌లో పాతుకుపోయి.. వికెట్ కాపాడుకుంటూ ఇన్నింగ్స్ నిలబెట్టాడు. కానీ, సూర్య అలా చేస్తాడా అంటూ కోహ్లీ కంటే బెటర్‌గా అయితే చేయలేడు. ఇవన్నీ మంజ్రేకర్‌కు తెలియందు కాదు. కానీ, ఎందుకో కోహ్లీని కావాలనే టార్గెట్ చేసి.. సూర్యకు హైప్ ఇస్తూ.. కోహ్లీని హేళన చేస్తున్నట్లు ఉందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
The orange cap is looking extra bright on this batter…most runs so far in the IPL, that too at a SR of 172! Well done Surya! 👏👏👏#IPLonJioStar #MI
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 2, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




