Ind Vs Zim: టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ హీరోయిన్‌.. జింబాబ్వే రోహిత్‌ సేనను చిత్తుచేస్తే ఆ పని చేస్తానంటూ..

|

Nov 03, 2022 | 7:20 PM

టీమిండియాపై గతంలో ఎన్నోసార్లు అక్కసు వెళ్లగక్కిన పాక్‌ హీరోయిన్‌ సెహర్‌ షిన్వారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే.. టీమిండియాను చిత్తుగా ఓడిస్తే ఆ దేశపు వ్యక్తినే పెళ్లాడతానంటూ తెలిపింది

Ind Vs Zim: టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్‌ హీరోయిన్‌.. జింబాబ్వే రోహిత్‌ సేనను చిత్తుచేస్తే ఆ పని చేస్తానంటూ..
Pakistan Actress
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ పేలవ ప్రదర్శన చేస్తోంది. టీమిండియా, జింబాబ్వే చేతుల్లో చావు దెబ్బతిన్న ఆ జట్టు సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నాకైట్‌ రేసుకు చేరుకోవాలంటే ఆజట్టు దక్షిణాఫ్రికా, బంగ్లాలపై కచ్చితంగా గెలవడంతో పాటు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంది. ఇదే నేపథ్యంలో టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్‌ 12 ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనున్న రోహిత్ సేన ఆ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవచ్చు. ఇదిలా ఉంటే టీమిండియాపై గతంలో ఎన్నోసార్లు అక్కసు వెళ్లగక్కిన పాక్‌ హీరోయిన్‌ సెహర్‌ షిన్వారీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే..  రోహిత్ సేనను చిత్తుగా ఓడిస్తే ఆ దేశపు వ్యక్తినే పెళ్లాడతానంటూ తెలిపింది. ‘తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను’ అని ఈ మేరకు ట్వీట్‌ చేసింది కాంట్రవర్సీ హీరోయిన్‌.

ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్‌ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచింది. నిన్న జరిగిన బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే ట్వీట్ల పెట్టింది. అంతకుముందు స్వదేశంలో టీ20 సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ చేతిలో టీమిండియా ఓడిపోయినపుడు కూడా టీమిండియాపై ఇలాగే విమర్శలు చేసింది.కాగా పాకిస్తాన్‌ హీరోయిన్‌ చేసిన ట్వీట్‌పై క్రికెట్‌ లవర్స్‌, టీమిండియా అభిమానులు ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. భారత్‌- బంగ్లా మ్యాచ్‌ సమయంలో ఆమె అంచనాలు తప్పాయి. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. జీవితమంతా పెళ్లి లేకుండా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది అంటూ ఆమెను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. జింబాబ్వే చేతిలో ఓడిపోవడానికి మాది పాకిస్తాన్‌ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..