
Pakistan vs New Zealand, 1st Match, Group A: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆతిథ్య పాకిస్థాన్‌కు 321 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 5 వికెట్లకు 320 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ తరఫున విల్ యంగ్ 107 పరుగులు, టామ్ లాథమ్ అజేయంగా 118 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులు సాధించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా, హరిస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అబ్రార్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది.
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ’రూర్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..