Champions Trophy 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు బిగ్ షాక్.. ఇక పెట్టె సర్దుకోవాల్సిందేనా?

ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లోనే డిపెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ కు ఘోర పరాజయం ఎదురైంది. బుధవారం (ఫిబ్రవరి 19) న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆజట్టు 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తర్వాతి మ్యాచ్ లో భారత్ తో తలపనుంది పాక్.

Champions Trophy 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు బిగ్ షాక్.. ఇక పెట్టె సర్దుకోవాల్సిందేనా?
PAK vs IND

Updated on: Feb 20, 2025 | 1:54 PM

ఫిబ్రవరి 23న జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఫఖర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫఖర్ గాయపడ్డాడు. బౌండరీ లైన్ పై ఫీల్డింగ్ చేస్తున్నఅతను బంతిని ఆపేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. అయినా అతను బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ఓపెనర్ గా ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిన ఫఖర్ జమాన్ గాయం కారణంగా 4వ స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఇక ఫఖర్ వైద్య నివేదిక ఇప్పుడు వచ్చింది. నివేదిక ప్రకారం ఈ ఓపెనర్ మరింత కాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అందువల్ల, అతను కొంతకాలం మైదానానికి దూరంగా ఉన్నాడు. పాకిస్తాన్ జట్టు రాబోయే మ్యాచ్‌లకు ఫఖర్ జమాన్ అందుబాటులో ఉండడం లేదు.

ఫఖర్ జమాన్ స్థానంలో మరో అనుభవజ్ఞుడైన ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్‌ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందని సమాచారం. కాబట్టి, ఫిబ్రవరి 23న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఇమామ్-ఉల్-హక్ బరిలోకి దిగ వచ్చు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫఖర్ జమాన్ భారత్‌పై సెంచరీ చేశాడు. ఆ రోజు ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన ఫఖర్ 106 బంతుల్లో 3 సిక్సర్లు, 12 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఈ సెంచరీ సహాయంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమిండియాపై సంచలనం సృష్టించిన బ్యాటర్ ఇప్పుడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఓపెనర్ గా యంగ్ ప్లేయర్..

పాకిస్తాన్ జట్టు:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..