- Telugu News Sports News Cricket news Orange cap in ipl 2023 ruturaj gaikwad to kohli these 5 players with highest runs
IPL 2023 Orange Cap: ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఐదుగురు.. అగ్రస్థానంలో ధోనీ శిష్యుడు.. కోహ్లీ ఎక్కడంటే?
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం రితురాజ్ గైక్వాడ్ చేతిలో ఉంది. అయితే చాలా మంది ఆటగాళ్ల నుంచి అతనికి గట్టి సవాలు ఎదురవుతోంది.
Updated on: Apr 07, 2023 | 9:05 PM

IPL 2023 Orange Cap Race: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2023లో చూస్తే, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు అత్యధిక పరుగులతో దూసుకపోతున్నాడు. అందుకే అతనికి ఆరెంజ్ క్యాప్ దక్కింది. అయితే దీని కోసం చాలా మంది ఆటగాళ్ల నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. IPL 2023లో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న 5గురు ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.

రితురాజ్ గైక్వాడ్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు అత్యధికంగా 149 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు చేయడంలో విజయం సాధించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 92 పరుగులు.

కైల్ మేయర్స్: లక్నో సూపర్ జెయింట్ బ్యాట్స్‌మెన్ కైల్ మేయర్స్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. రితురాజ్ గైక్వాడ్‌కు గట్టి సవాల్ విసురుతున్నాడు. ఐపీఎల్ 2023లో మేయర్స్ ఇప్పటివరకు 126 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 73 పరుగులు.

శిఖర్ ధావన్: ఆరెంజ్ క్యాప్ రేసులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. అతను మూడో స్థానంలో ఉన్నాడు. 2023లో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 126 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 86 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌ను కోహ్లీ అద్భుతంగా ప్రారంభించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడి 103 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ అత్యధిక స్కోరు 82 నాటౌట్‌గా నిలిచాడు.

సంజు శాంసన్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతను 97 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతను అర్ధ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో సంజూ శాంసన్ అత్యధిక స్కోరు 57 పరుగులు.





























