World Cup 2023: రోహిత్ టాస్ గెలిచి గంటన్నర.. అయినా ప్రారంభం కాని భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్.. కారణం ఏమిటంటే..?
World Cup 2023: వన్డే వరల్డ్ కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా రెండో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంగా నిలిచాడు. అవును, రెండో రోజు గువహతి వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో వార్మప్ మ్యాచ్‌కి వర్షం అడ్డు వచ్చింది. టాస్ వేయక ముందు పరిస్థితి అంతా అనుకూలంగానే ఉన్నా.. ఆ తర్వాత ఆటకు ఆటంకం కలిగింది. వర్షం అలాగే..

World Cup 2023: వన్డే వరల్డ్ కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా రెండో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంగా నిలిచాడు. అవును, రెండో రోజు గువహతి వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో వార్మప్ మ్యాచ్‌కి వర్షం అడ్డు వచ్చింది. టాస్ వేయక ముందు పరిస్థితి అంతా అనుకూలంగానే ఉన్నా.. ఆ తర్వాత ఆటకు ఆటంకం కలిగింది. వర్షం అలాగే కొనసాగుతుండడంతో ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఒక వేళ వర్షం ఆగకుండా ఇదే రీతిలో పడితే నిన్నటి సౌతాఫ్రికా-ఆఫ్గానిస్తాన్ వార్మప్ మ్యాచ్ మాదిరిగానే, నేటి భారత్-ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ కూడా రద్దు కావడం ఖాయం.
It is raining continuously in Guwahati, the match against England will take time. #INDvsENG #WorldCup2023 #AnushkaSharmapic.twitter.com/kvfUKbCJZA
— 𝐃𝙴𝚅 ࿐ (@Devendr47974332) September 30, 2023
మరో వైపు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో జరగాల్సిన ఆస్ట్రేలియా VS నెదర్లాండ్స్ ఐదో వార్మప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌కి టాస్ వేయక ముందు నుంచే వరుణుడు అడ్డుగా నిలిచాడు.
It’s raining like crazy. 😧 #CWC23
IND vs ENG – Match delayed due to rainAUS vs NED – Match delayed due to rain #CWC23 #WorldCup2023 #INDvsENG #ausvsned pic.twitter.com/IVIoskGnRT
— Meer Adnan (@MeerAdn85868050) September 30, 2023
నాల్గో వార్మప్ మ్యాచ్ భారత్-ఇంగ్లాండ్ జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
ఐదో వార్మప్ మ్యాచ్ ఆస్ట్రేలియా–నెదర్లాండ్స్ జట్లు:
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, బాస్ డి లైడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూర్, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సాకిబ్ జుల్ఫిక్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..