AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Watson: 2023 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్‌ ఆడే 4 జట్లు ఇవే.. తేల్చి చెప్పేసిన ఆసీస్ మాజీ కెప్టెన్..

ODI World Cup 2023: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 5 రోజులే మిగిలి ఉంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్‌పై అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లకు భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు తమ అభిమాన జట్టు కప్ కొడుతుందనే ఆశలతో ఉంటే.. పలువురు మాజీలు టోర్నీ సెమీ ఫైనల్స్‌కి చేరే జట్లు ఏవో తమ అంచనాలను చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సన్ కూడా పెదవి విప్పాడు.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 30, 2023 | 4:12 PM

Share
ODI World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు మాజీలు సెమీఫైనల్ చేరుకునే జట్లను ఎంపిక చేసుకోగా.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్ వాట్సన్ కూడా  తన ఫేవరెట్ 4 జట్లను ప్రకటించాడు.

1 / 5
షేన్ వాట్సన్ ప్రకారం సెమీ ఫైనల్స్‌కి ఆస్ట్రేలియా మొదటిగా చేరుతుంది. వరల్డ్ కప్ టోర్నీల్లో విజృంభించి ఆడే ఆసీస్.. ఈ సారి కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోందని, టోర్నమెంట్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి సెమీ ఫైనల్స్‌కి చేరుతుందని ఆ టీమ్ మాజీ ప్లేయర్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.

2 / 5
సొంత ప్రజలు, సొంత గడ్డపై వరల్డ్ కప్ 2023 టోర్నీని ఆడుతున్న భారత్ కూడా సెమీ ఫైనల్స్‌కి చేరుకోవడం ఖాయమని వాట్సన్ అంటున్నాడు.

3 / 5
వాట్సన్ ఎంపిక చేసిన జట్లలో ఇంగ్లాండ్ కూడా ఉంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లీష్ టీమ్ వైట్ బాల్ క్రికెట్‌లో అగ్రసీవ్‌గా ఆడుతోందని, వారి ఆటతీరు వారిని తప్పక సెమీ ఫైనల్స్‌కి చేరుస్తుందని వాట్సన్ చెప్పుకొచ్చాడు.

4 / 5
వన్డ్ వరల్డ్ కప్ 2023 టోర్నీలో సెమీ ఫైనల్స్‌కి చేరుకునే జట్లుగా వాట్సన్ ఎంపిక చేసిన టీమ్‌లలో పాకిస్తాన్ చివరిది. ఐసీసీ టోర్నమెంట్‌ల్లో బాగా రాణించిన చరిత్ర పాక్‌కి ఉందని, ఫామ్‌లో ఉన్న జట్టుతో బరిలోకి దిగుతున్న పాకిస్తాన్ తప్పక సెమీ ఫైనల్స్‌కి చేరుతుందన్నాడు వాట్సన్.

5 / 5