- Telugu News Photo Gallery Cricket photos Ravichandran Ashwin And Virat Kohli Could Achieve Unique Feat If India Win ODI World Cup 2023
ODI World Cup 2023: భారత్ ప్రపంచ కప్ గెలిస్తే, ఆ ఇద్దరూ చరిత్ర సృష్టించినట్లే.. సచిన్ వంటి దిగ్గజానికి కూడా చోటు దక్కని లిస్టులో స్థానం..
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి వారం రోజులే మిగిలి ఉన్నాయి. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగబోతోంది. అయితే అనూహ్యరీతిలో జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. భారత్‌కి ట్రోఫీ అందించడంతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి ఓ అరుదైన రికార్డ్ సృష్టించే యోచనలో ఉన్నాడు. అవును, ఈ సారి భారత్ టైటిల్ గెలిస్తే.. అశ్విన్, కోహ్లీ కోసమే ఓ ప్రత్యేక లిస్టు ఏర్పాటవుతుంది.
Updated on: Sep 29, 2023 | 6:18 PM

ODI World Cup 2023: భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇక సొంతగడ్డపై జరిగిన 2011 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈ సారి కూడా కప్ గెలుచుకునేందుకు పూర్తిగా సిద్ధమైంది.

2011 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకున్న భారత్.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ 2023 మినహా మరే ఇతర ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. అయితే ఈ సారి ఎలా అయినా కప్ కొట్టాల్సిందే అంటూ టోర్నీలోకి ప్రవేశించబోతోంది రోహిత్ సేన.

రోహిత్ సేన కోరుకున్నట్లుగానే కప్ గెలిస్తే.. భారత జట్టులోని విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డ్‌ను, లిస్టును సృష్టిస్తారు.

ఇప్పటి వరకు భారత్ రెండు వరల్డ్ కప్‌లు (1983, 2011) గెలిచినా.. ఆ 2 విన్నింగ్ టీమ్స్‌లో ఉమ్మడి ప్లేయర్లు లేరు. అంటే 1983 వరల్డ్ కప్ విన్నింగ్స్ టీమ్ సభ్యులు, 2011 వరల్డ్ కప్ విన్నింగ్స్ టీమ్ సభ్యులు పూర్తిగా వేరు.

కానీ 2011 ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన కోహ్లీ, అశ్విన్ ఈ సారి కూడా దేశానికి కప్ అందిస్తే.. భారత్ తరఫున ఒకటి కంటే ఎక్కువ వరల్డ్ కప్‌లు గెలిచిన ఆటగాళ్లుగా చరిత్రలో నిలుస్తారు. ఇంకా భారత్ కోసం ఒకటి కంటే ఎక్కువ వరల్డ్ కప్‌లు గెలిచిన ఆటగాళ్లుగా ఓ ప్రత్యేకమైన లిస్టు కూడా ఏర్పటవుతుంది.

2023 వరల్డ్ కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ మహ్మద్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.





























