- Telugu News Photo Gallery Cricket photos 8 players who played CWC 2011 and also featuring in Cricket World Cup 2023
ప్రపంచ కప్ 2023 టోర్నీలో ఆడబోతున్న ‘2011 వరల్డ్ కప్’ ప్లేయర్లు.. కోహ్లీ, ఆశ్విన్ సహా లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గోనే అన్ని దేశాలు ఇప్పటివకే తమ జట్లను కూడా ప్రకటించగా.. శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే భారత్ వేదికగా జరిగిన 2011 వరల్డ్ కప్‌లో ఆడిన కొందరు ప్లేయర్లు 2023 టోర్నీలో కూడా కనిపించబోతున్నారు. వారిలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఉండగా.. ఇతర దేశాల నుంచి మరో ఆరుగురు ప్లేయర్లు ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 29, 2023 | 4:37 PM

విరాట్ కోహ్లీ: 2011 వరల్డ్ కప్ ఆడి 2023 టోర్నీలో కనిపించబోతున్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. 2011 మెగా టోర్నీలో టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మొత్తం 282 పరుగులు చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్: 2023 వరల్డ్ కప్‌లో కనిపించబోతున్న ‘2011 టోర్నీ’ ప్లేయర్లలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. 2011 వరల్డ్ కప్‌లో వెస్టీండీస్, ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌ల్లో ఆడిన అశ్విన్.. రెండు జట్లపైనా 2, 2 వికెట్లు తీశాడు.

స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌కి వెన్నుముకగా 2023 టోర్నీలో కనిపించబోతున్న స్టీవ్ స్మిత్ 2011 వన్డే వరల్డ్ కప్‌లో ప్రధాన స్పిన్నర్‌గా కనిపించాడు. అప్పటి టోర్నీలో 6 మ్యాచులు ఆడిన స్మిత్ 51 పరుగులు చేసి, ఒక్క వికెట్ తీశాడు.

కేన్ విలియమ్సన్: 2023 వన్డే వరల్డ్ కప్ బ్లాక్ క్యాప్స్‌ని ముందుండి నడిపించబోతున్న కేన్ విలియమ్సన్.. 2011 టోర్నీలో 4 మ్యాచ్‌లు ఆడి 99 పరుగులు చేశాడు.

టిమ్ సౌథీ: 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోతున్న న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ.. 2011 టోర్నీలో బ్లాక్ క్యాప్స్ తరఫున 18 వికెట్లు తీశాడు.

అదిల్ రషీద్: 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్, 2011 టోర్నీలోనూ ఆడాడు. ఆ టోర్నీలో అదిల్ 11 వికెట్లు పడగొట్టాడు.

షకీబ్ అల్ హసన్: 2023 వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌ను నడిపించబోతున్న షకిబ్ అల్ హాసన్.. 2011 టోర్నీలోనూ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక అప్పటి టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన షకిబ్ ఆల్‌రౌండర్‌గా 142 పరుగులు, 8 వికెట్లు తీశాడు.

ముష్ఫికర్ రహీమ్: 2023 వరల్డ్ కప్‌లో ఆడుతున్న ముష్ఫికర్ రహీమ్, 2011 టోర్నీ ఆడిన బంగ్లాదేశ్ జట్టులోనూ సభ్యుడే.




