
India vs Netherlands, 45th Match 1st Innings Highlights: ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ అందించింది. బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. నంబర్-4 శ్రేయాస్ అయ్యర్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించగా, ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ రెండో సెంచరీ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
పవర్‌ప్లేలో భారత్ తుఫాన్ ఆరంభం..
భారత ఓపెనర్లు జట్టుకు తుఫాన్ ఆరంభాన్ని అందించారు. గిల్, రోహిత్‌ల జోడీ తొలి ఓవర్ నుంచే దూకుడిగా ఆడారు. ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ 2 ఫోర్లు బాదగా, గిల్ 95 మీటర్ల సిక్సర్ బాదాడు. దీంతో భారత జట్టు తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..