ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఆ జట్టే ఫేవరెట్‌.. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిన టీమిండియా మాజీ కోచ్‌

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్- 2023 టోర్నమెంట్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఈ టోర్నీ నవంబర్ 19 వరకు కొనసాగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న కొద్దీ మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూలలో ప్రకటనలు చేస్తున్నారు.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ఆ జట్టే ఫేవరెట్‌.. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిన టీమిండియా మాజీ కోచ్‌
Greg Chappell

Updated on: Aug 22, 2023 | 7:26 PM

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్- 2023 టోర్నమెంట్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఈ టోర్నీ నవంబర్ 19 వరకు కొనసాగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న కొద్దీ మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఇంటర్వ్యూలలో ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి ఏ జట్టు ప్రపంచకప్‌ను గెలుస్తుంది? ఎవరికి అవకాశం లభిస్తుంది? ఏ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది? అంటూ ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు గ్రెగ్ చాపెల్ కూడా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గురించి మాట్లాడాడు. గ్రెగ్‌ చాపెల్‌ 2005 నుంచి 2007 వరకు భారత జట్టుకు కోచ్‌గా విధులు నిర్వర్తించారు. అయితే కెప్టెన్‌ గంగూలీతో తరచూ గొడవలు పెట్టుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచాడు. ఈక్రమంలో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలపై స్పందించిన చాపెల్‌..’ నేను కోచ్‌గా ఉన్నప్పుడు స్వదేశంలో భారత్ ఇతర జట్లపై ఆధిపత్యం చెలాయించింది. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని భారత్ ప్రదర్శనను ఆస్వాదించాను. స్వదేశంలో టీమిండియా ఎప్పుడూ పులే. కాబట్టి ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరికలు పంపాడు చాపెల్‌.

రెవ్‌స్పోర్ట్జ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ మాట్లాడుతూ, స్వదేశంలో భారత జట్టు ఎప్పుడూ అద్భుతంగా ఆడుతుందని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని భారత్‌ ఆటను చూడటం చాలా సరదాగా ఉంటుందన్నాడు. స్వదేశంలో భారత్ అద్భుతంగా ఆడుతుందని గ్రెగ్ చాపెల్ అన్నాడు. ‘స్వదేశంలో భారత్‌కు ఎలాంటి టార్గెట్‌ ఇచ్చినా.. సులువుగా ఛేదిస్తుంది. ఈ ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ ఫేవరెట్. టీమ్ ఇండియాను ఓడించేందుకు ప్రత్యర్థి జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌లో ఆసియా దేశాలు రాణిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లకు ఇక్కడ పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. ముఖ్యంగా గతంలో లాగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారత్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని భావిస్తున్నాను. ఎందుకంటే ఇటీవల ఐపీల్‌తో పాటు చాలా సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌లో ఎక్కువ సమయం గడిపారు. ఇక్కడి పిచ్, వాతావరణం ఆసీస్‌ ఆటగాళ్లకు బాగా తెలుసు. అలాగే ఇంగ్లండ్ క్రికెటర్లు భారత్‌లో ఎక్కువ సమయం గడిపారు. కాబట్టి భారత్‌లో క్రికెట్ ఆడడం వారికి పెద్దగా కష్టం కాదు’ అని చాపెల్‌ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..