World Cup 2023: భారత్‌కే సొంతమైన ‘మెగా సెంచరీ’ రికార్డుపై ఆస్ట్రేలియా కన్ను.. తొలి పోరు నుంచే మోత మోగేనా..?

ODI World Cup 2023: 1975 వరల్డ్ కప్ ద్వారా ప్రారంభమైన వన్డే మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన దేశం ఏమిటో తెలుసా..? 13వ ఎడిషన్ వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందుగానే ఆ లెక్కలపై ఆస్ట్రేలియా కన్నేసింది. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు భారత్‌దే కాగా, ఆసీస్ రెండో స్థానంలో ఉంది. గత 12 ప్రపంచ కప్‌ టోర్నీల్లో టీమిండియా ఆటగాళ్లు మొత్తం..

World Cup 2023: భారత్‌కే సొంతమైన ‘మెగా సెంచరీ’ రికార్డుపై ఆస్ట్రేలియా కన్ను.. తొలి పోరు నుంచే మోత మోగేనా..?
IND vs AUS; ODI World Cup 2023

Updated on: Oct 01, 2023 | 6:20 PM

ODI World Cup 2023: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా 4 రోజుల నిరీక్షణే మిగిలి ఉంది. తమ అభిమాన క్రికెటర్లు టోర్నీలో సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవాలని భారీ అంచనాలనే పెట్టుకున్నారు. అలాగే తమ అభిమాన దేశం టోర్నీ విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు. అయితే 1975 వరల్డ్ కప్ ద్వారా ప్రారంభమైన వన్డే మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన దేశం ఏమిటో తెలుసా..? 13వ ఎడిషన్ వరల్డ్ కప్ ప్రారంభం కంటే ముందుగానే ఆ లెక్కలపై ఆస్ట్రేలియా కన్నేసింది. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు భారత్‌దే కాగా, ఆసీస్ రెండో స్థానంలో ఉంది. గత 12 ప్రపంచ కప్‌ టోర్నీల్లో టీమిండియా ఆటగాళ్లు మొత్తం 32 సెంచరీలు చేయగా.. కంగారులు 31 సెంచరీలు చేశారు. అంటే భారత్, ఆస్ట్రేలియాకి మధ్య ఒక్క సెంచరీ మాత్రమే తేడా ఉంది. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ద్వారా అయినా భారత్‌ని అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆసీస్ ప్లేయర్లు.

అయితే రెండు జట్లు అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌‌ ద్వారా వరల్డ్ కప్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. ఇరు జట్లకూ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అయినందున.. ఇందులో ఏ ఆసీస్‌ బ్యాటర్‌ సెంచరీ సాధించినా భారత్‌ పేరిట ఉన్న ప్రపంచ కప్‌ సెంచరీ రికార్డు సమం అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ టీమిండియా బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే సెంచరీల మోత మోగిస్తే.. ఇరు దేశాల మధ్య ప్రపంచ కప్ సెంచరీల అంతరం మరింతగా పెరుగుతుంది. ఇలా భారత్, ఆస్ట్రేలియా కాకుండా ‘ప్రపంచ కప్ సెంచరీ’లు సాధించిన జట్ల జాబితాలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..

    1. భారత్- 32 సెంచరీలు
    2. ఆస్ట్రేలియా – 31 సెంచరీలు
    3. శ్రీలంక – 25 సెంచరీలు
    4. వెస్టిండీస్ – 19వ శతాబ్దం
    5. ఇంగ్లాండ్ – 18వ శతాబ్దం
    6. న్యూజిలాండ్ – 17 సెంచరీలు
    7. పాకిస్థాన్ – 16 సెంచరీలు
    8. దక్షిణాఫ్రికా – 15 సెంచరీలు
    9. జింబాబ్వే – 6 సెంచరీలు
    10. బంగ్లాదేశ్ – 5 సెంచరీలు
    11. నెదర్లాండ్స్ – 5 సెంచరీలు

టీమిండియా వరల్డ్ కప్ షెడ్యూల్:

వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత్, ఆస్ట్రేలియా జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.