ODI World Cup 2023: 2 రోజుల్లోనే 3 మ్యాచ్‌లు రద్దు.. బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ఫైర్..

ODI World Cup 2023: వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇప్పటి వరకు జరిగిన 5 వార్మప్ మ్యాచ్‌ల్లో మూడు వర్షార్పణం అయ్యాయి. దీంతో బీసీసీఐపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ టోర్నీకి టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోవడంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆసీస్‌తో వన్డే సరీస్ జరిగినా అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ మాత్రమే..

ODI World Cup 2023: 2 రోజుల్లోనే 3 మ్యాచ్‌లు రద్దు.. బీసీసీఐపై క్రికెట్ అభిమానులు ఫైర్..
IND vs ENG Cancelled Warm Up Match

Updated on: Oct 01, 2023 | 5:01 PM

World Cup 2023: భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ చేరుకున్న అన్ని జట్లూ ఒక్కో వార్మప్ మ్యాచ్‌ని కూడా ఆడాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన 5 వార్మప్ మ్యాచ్‌ల్లో మూడు వర్షార్పణం అయ్యాయి. దీంతో బీసీసీఐపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ టోర్నీకి టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోవడంతో నెటిజన్లు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆసీస్‌తో వన్డే సరీస్ జరిగినా అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ మాత్రమే ఆడారు. హార్దిక్ పాండ్యా అయితే మూడో మ్యాచ్‌కి కూడా దూరం అయ్యాయి. ఇలా ప్రాక్టీస్ లేకుండానే టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు రాణించడం, భారత్ విజేతగా నిలవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

అవును, తిరువనంతపురం వేదికగా జరగాల్సిన సౌతాఫ్రికా-అఫ్గానిస్తాన్ (శుక్రవారం) వార్మప్ మ్యాచ్ పూర్తిగా రద్దవగా.. ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ (శనివారం) వార్మప్ మ్యాచ్‌ కొంతమేర జరిగి ఫలితం లేకుండా ముగిసింది. అలాగే గువహతిలో శనివారం జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‌కి టాస్ తర్వాత వర్షం అడ్డు పడడంతో మొత్తానికే రద్దయింది.  దీంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వాతావరణ హెచ్చరికలతో సంబంధం లేకుండా ఏ ఆలోచనలతో వార్మప్ మ్యాచులు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్నీ విషయంలో ఇలా ఆటలాడుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఆరంభంలోనే అపశకునాలు

 

 

వీకెండ్ వృధా

కాగా, ఇటీవల జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీలో కూడా ఇదే విధంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఆ టోర్నీకే మెయిన్ అట్రాక్షన్ అయిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగానే రద్దయింది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా బీసీసీఐపై విమర్శలు గుప్పించారు.