AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitish Rana : మనల్ని ఎవడ్రా ఆపేది.. 24గంటల్లోనే నితీష్ రాణా రెండు అద్భుత ఇన్నింగ్స్.. ఫైనల్స్‌లోకి జట్టు

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌లోకి వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు దూసుకెళ్లింది. ఈ విజయానికి ప్రధాన కారణం జట్టు కెప్టెన్ నితీష్ రాణా. గత 24 గంటల్లో రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన నితీష్, ప్రత్యర్థి జట్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. కేవలం 81 బంతుల్లో 17 సిక్స్‌లు 12 ఫోర్లతో 179 పరుగులు చేసి, తన జట్టును తొలిసారి ఫైనల్‌కు చేర్చాడు.

Nitish Rana : మనల్ని ఎవడ్రా ఆపేది.. 24గంటల్లోనే నితీష్ రాణా రెండు అద్భుత ఇన్నింగ్స్.. ఫైనల్స్‌లోకి జట్టు
Nitish Rana
Rakesh
|

Updated on: Aug 31, 2025 | 11:42 AM

Share

Nitish Rana : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. వెస్ట్ ఢిల్లీని ఫైనల్స్‌కు చేర్చడంలో కెప్టెన్ నితీష్ రాణా కీలక పాత్ర పోషించాడు. గత 24 గంటల్లో అతను రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. కేవలం 81 బంతుల్లో 17 సిక్స్‌లు, 12 ఫోర్లతో 179 పరుగులు చేసి, తన జట్టును తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. ఫైనల్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో తలపడుతుంది.

నితీష్ రాణా విధ్వంసం

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌పై భారీ సెంచరీ కొట్టిన తర్వాత, వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా క్వాలిఫైయర్-2లో కూడా అదే దూకుడు చూపించాడు. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు చేసి, తన జట్టుకు 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఫైనల్స్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది. అంతకుముందు అతను ఎలిమినేటర్ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌పై 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్‌లతో 134 పరుగులు చేశాడు. క్వాలిఫైయర్-2లో నితీష్ తో పాటు ఆయుష్ దోసేజా కూడా అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు.

ఆయుష్ హాఫ్ సెంచరీ

క్వాలిఫైయర్-2లో మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ లయన్స్ కేవలం 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. నితీష్ తో పాటు ఆయుష్ దోసేజా 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ యాదవ్ 25 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఈస్ట్ ఢిల్లీ తరపున రోహిత్ యాదవ్, మయాంక్ రావత్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

ఈస్ట్ ఢిల్లీ దారుణమైన బ్యాటింగ్

క్వాలిఫైయర్-2లో మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్పిత్ రాణా అత్యధికంగా 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. రౌనక్ వాఘేలా 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరపున మనన్ భరద్వాజ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. టిసాంత్ దాబ్లా, అనిరుధ్ చౌదరి చెరో రెండు వికెట్లు, శుభమ్ దూబే ఒక వికెట్ సాధించారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి