T20I Records : దెబ్బకి టీ20 అంటే వీళ్ళే గుర్తొస్తారు.. ఈ టీమ్స్ రికార్డులు చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
టీ20 క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం. ఈ ఫార్మాట్‌లో భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. గత కొన్ని సంవత్సరాలలో, చాలా జట్లు పరుగుల విషయంలో అన్ని హద్దులు దాటేశాయి. అయితే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్లు ఏవో చూద్దాం. ఈ జాబితాలో ఒక జట్టు రెండుసార్లు ఉండటం విశేషం.

T20I Records : టీ20 క్రికెట్ అంటేనే టీ20 క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్సర్లు, పరుగుల వర్షం. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్మెన్లు బౌండరీల మోత మోగిస్తుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా అనేక జట్లు పరుగుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్ల గురించి, ఆ రికార్డులకు కారణమైన జట్ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ జాబితాలో ఒక జట్టు రెండు సార్లు ఉండగా, మన భారత్ కూడా రెండు సార్లు ఉండడం విశేషం.
టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు
1. జింబాబ్వే vs గాంబియా (344/4):
2024 అక్టోబర్ 23న నైరోబిలో (రురాకా) జింబాబ్వే, గాంబియాపై టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. కేవలం 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వారి రన్ రేట్ 17 కంటే ఎక్కువ. భారీ లక్ష్యం ముందు గాంబియా నిలబడలేకపోయింది, జింబాబ్వే సులభంగా విజయం సాధించింది. ఇది ఇప్పటివరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరుగా నమోదైంది.
2. నేపాల్ vs మంగోలియా (314/3):
2023 సెప్టెంబర్ 27న జరిగిన ఆసియా క్రీడలలో నేపాల్ జట్టు మంగోలియాపై చరిత్ర సృష్టించింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీల మెరుపు ఇన్నింగ్స్‌లు మంగోలియా బౌలర్లను చిత్తు చేశాయి. దానికి సమాధానంగా, మంగోలియా కేవలం 41 పరుగులకే ఆలౌట్ అయింది. నేపాల్ 273 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది ఆసియా క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం.
3. భారత్ vs బంగ్లాదేశ్ (297/6):
2024 అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లు నిలకడగా భారీ షాట్లు కొట్టారు. జట్టు రన్ రేట్ దాదాపు 15గా ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ సత్తా చాటింది.
4. జింబాబ్వే vs సెషల్స్ (286/5):
ఈ జాబితాలో జింబాబ్వే పేరు రెండుసార్లు ఉంది. 2024 అక్టోబర్ 19న నైరోబిలో జింబాబ్వే, సెషల్స్‌పై 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. వరుసగా రెండు భారీ స్కోర్లు సాధించి, బలహీన జట్లపై తాము ఎంత ప్రమాదకరంగా ఉంటారో నిరూపించింది.
5. భారత్ vs సౌత్ ఆఫ్రికా (283/1):
2024 నవంబర్ 15న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్, సౌత్ ఆఫ్రికాపై 1 వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే, ఒక బలమైన జట్టుపై కేవలం ఒక వికెట్ కోల్పోయి ఇన్ని పరుగులు చేయడం. ఇది వారి బ్యాటింగ్ బలం ఎంత గొప్పదో చూపిస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




