AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Axar Patel: ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి టీమిండియా ఆటగాళ్ల ప్రత్యేక పూజలు.. ‘భస్మ హారతి’లో పాల్గొన్న అక్షర్ పటేల్ దంపతులు..

అక్షర్ పటేల్ అతని భార్య మేహా పటేల్‌తో కలిసి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Axar Patel: ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి టీమిండియా ఆటగాళ్ల ప్రత్యేక పూజలు.. ‘భస్మ హారతి’లో పాల్గొన్న అక్షర్ పటేల్ దంపతులు..
Cricketer Axar Patel Visits Mahakaleshwar Temple
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2023 | 5:01 PM

Share

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్‌ అనంతరం మహాదేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. చివరి రోజు అంటే ఫిబ్రవరి 26న టీమిండియా ఆటగాళ్లు, కేఎల్ రాహుల్‌తోపాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సతీమణి మేహతో కలిసి ఆలయంలో శివ దర్శనం చేసుకున్న అక్షర్.. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ‘భస్మ హారతి’లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు.

పూజల అనంతరం మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. తాను 5 సంవత్సరాల క్రితం కూడా సందర్శించానని, అయితే అప్పుడు భస్మ హారతికి హాజరు కాలేకపోయానని పటేల్ చెప్పారు. ఈరోజు ఆ కోరిక నెరవేరిందన్నారు. భస్మ హారతిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అంతకుముందు రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ తన భార్య అతియా శెట్టితో కలిసి ఉజ్జయిని చేరుకుని అక్కడ బాబా మహాకాల్‌ను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాహానంతరం తొలిసారిగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు అథియా శెట్టి బాబా మహాకాల్‌ను దర్శించుకున్నారని ఆలయ పూజారి ఆశిష్ పూజారి తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జట్టుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఇక టీమిండియాలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లుగానే ఉంది. ఒక్కొక్క ఆటగాడే వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒకింటి వారయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా చేరాడు. మిట్టలి పారూల్కర్‌ను ఠాకూర్ వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక చాలా ఘనంగా జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం

Follow Us
వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు..
వివాదంలో అనుష్క శ‌ర్మ.. చేతుల‌తో అసభ్యకరమైన సైగ‌లు..
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న సినీజనాలు
పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేస్తున్నారా? తల్లిదండ్రులు మారాల్సిందే
పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేస్తున్నారా? తల్లిదండ్రులు మారాల్సిందే
సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం..
సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకముందే నాకు పరిచయం..
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ ఒక్క పని చేస్తే మీరు సేఫ్
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సాధారణ రవ్వ హల్వాతో బోర్ కొట్టిందా? ఈ క్యారమెల్ ఫ్లేవర్తో పండగే..
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన వైభవ్
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇక ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
గూగుల్ క్యాంపస్‌కి తాతను తీసుకెళ్లిన టెక్కీ..వీడియో వైరల్
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..