AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇవెక్కడి రూల్స్‌రా బాబు.. రనౌట్ అయినా.. నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

NZ vs SL 1st T20I Video: శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్లో, చమిక కరుణరత్నే రెండో పరుగు తీసుకునే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. అయితే అంపైర్ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.

Viral Video: ఇవెక్కడి రూల్స్‌రా బాబు.. రనౌట్ అయినా.. నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Nz Vs Sl Viral Video
Venkata Chari
|

Updated on: Mar 26, 2023 | 5:35 AM

Share

NZ vs SL 1st T20I Video: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన డ్రామా కనిపించింది. నిజానికి శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించిన చమిక కరుణరత్నే రనౌట్ కాగా.. న్యూజిలాండ్ ఆటగాడు బెయిల్స్ పడగొట్టినా వెలుగులు రాలేదు. అయితే లైట్లు వెలగకపోవడంతో బ్యాట్స్‌మన్ నాటౌట్‌గా నిర్ణయించారు. ఆ తర్వాత చాలా డ్రామా నడిచింది. అదే సమయంలో సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది.

బెల్స్ వెలగకపోవడంతో బ్యాట్స్‌మన్ నాటౌట్..

క్రికెట్‌లో ఉపయోగించే కొత్త స్టంప్‌లు ఛార్జింగ్‌తో పనిచేస్తుంటాయి. దీంతో బెయిల్స్‌ను వికెట్ నుంచి తొలగించిన తర్వాత, దానిలో లైట్ వెలుగుతుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో భిన్నమైన దృశ్యం కనిపించింది. అయితే, ఈ డ్రామా ఇక్కడితో ఆగలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కూడా బెయిల్‌ల కారణంగా డ్రామా చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, బెయిల్‌లు పడలేదు, ఆ తర్వాత కివీ బ్యాట్స్‌మెన్ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే, సోషల్ మీడియాలో అభిమానులు ఈ క్రికెట్ నిబంధనలను నమ్మలేకపోతున్నారు. అభిమానులు తమ కామెంట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు.

ఇవి కూడా చదవండి

భారీ తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం..

మరోవైపు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, న్యూజిలాండ్ శ్రీలంకను భారీ తేడాతో ఓడించింది. దీంతో న్యూజిలాండ్‌ జట్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 274 పరుగులు చేసింది. ఈ విధంగా మ్యాచ్‌లో శ్రీలంక 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా, కేవలం 20వ ఓవర్లో 76 పరుగులకే కుప్పకూలింది. విశేషమేమిటంటే, ఇంతకు ముందు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో కూడా శ్రీలంకను ఓడించింది. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..