IPL: అత్యాచారం ఆరోపణలతో ఐపీఎల్ ప్లేయర్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3లక్షల జరిమానా.. ఎవరంటే?

Nepal Cricket Team: మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో సందీప్ లామిచానే దోషిగా శుక్రవారం ఖాట్మండు కోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది జనవరిలో, లామిచాన్‌ను కోర్టు విడుదల చేసింది. ఎందుకంటే, అతను 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని గతంలో ఆరోపణలు వచ్చాయి. దాని కోసం అతన్ని అరెస్టు చేశారు. ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో క్రికెటర్ మైనర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

IPL: అత్యాచారం ఆరోపణలతో ఐపీఎల్ ప్లేయర్‌కు 8 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3లక్షల జరిమానా.. ఎవరంటే?
Sandeep Lamichhane Ipl
Follow us

|

Updated on: Jan 10, 2024 | 8:02 PM

Delhi Capitals: నేపాల్ క్రికెట్ జట్టు (Nepal Cricket Team) మాజీ కెప్టెన్, ఐపీఎల్‌ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైన సందీప్ లామిచానే(Sandeep Lamichhane)పై అత్యాచారం ఆరోపణలపై జిల్లా కోర్టు బుధవారం 8 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల నేపాల్ రూపాయల జరిమానా విధించింది. సింగిల్ బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తి శిశిర్ రాజ్ ధాకల్ సందీప్ లామిచానేకు శిక్ష విధించారు. అతడికి మొత్తం రూ.3 లక్షల జరిమానా విధించగా, అందులో క్రికెటర్ బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అత్యాచార బాధితురాలు మొదట ఏస్ బౌలర్‌పై ఫిర్యాదు చేసిన 15 నెలల తర్వాత జిల్లా కోర్టు తీర్పు వచ్చింది. విచారణ ప్రారంభమైనప్పుడు, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు లామిచానే వెస్టిండీస్‌లో ఉన్నాడు. అక్టోబరు 6, 2022న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయనను అరెస్టు చేశారు. నవంబర్ 4, 2022న, ఖాట్మండు జిల్లా కోర్టు సందీప్ లామిచానేను నిర్బంధ విచారణ తర్వాత సుందరా కేంద్ర కారాగారానికి పంపాలని ఆదేశించింది. ఈ సూచనను లామిచానే హైకోర్టులో సవాలు చేశారు.

మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో సందీప్ లామిచానే దోషిగా శుక్రవారం ఖాట్మండు కోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది జనవరిలో, లామిచాన్‌ను కోర్టు విడుదల చేసింది. ఎందుకంటే, అతను 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని గతంలో ఆరోపణలు వచ్చాయి. దాని కోసం అతన్ని అరెస్టు చేశారు. ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో క్రికెటర్ మైనర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.

23 ఏళ్ల లామిచాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కనిపించిన నేపాల్ దేశం నుంచి మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున లామిచానే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. సందీప్ లామిచానే నేపాల్ తరపున 51 ODI, 52 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను అంతర్జాతీయ స్థాయిలో తన జట్టు కోసం చాలా పెద్ద రికార్డులను సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..