AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: కోహ్లీ ప్లేస్ కొట్టేసిన యంగ్ ప్లేయర్? తొలి టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

IND vs AFG Playing XI: మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టును ఉద్దేశించి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లీ మొదటి మ్యాచ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఆడకపోవడానికి స్పష్టమైన కారణం చెప్పలేదు. కుటుంబ కారణాలను పేర్కొంటూ విలేకరుల ప్రశ్నలను ద్రవిడ్ దాటవేశాడు. అయితే, జనవరి 11న కోహ్లీ కూతురు వామిక పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే.

IND vs AFG: కోహ్లీ ప్లేస్ కొట్టేసిన యంగ్ ప్లేయర్? తొలి టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
India Playing 11 Vs Afg
Venkata Chari
|

Updated on: Jan 11, 2024 | 6:55 AM

Share

India Playing XI vs Afghanistan: సుమారు 14 నెలల తర్వాత కింగ్ కోహ్లి (Virat kohli)ని పొట్టి ఫార్మాట్‌లో చూడాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియా అభిమానులకు షాక్ తగిలింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టును ఉద్దేశించి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లీ మొదటి మ్యాచ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఆడకపోవడానికి స్పష్టమైన కారణం చెప్పలేదు. కుటుంబ కారణాలను పేర్కొంటూ విలేకరుల ప్రశ్నలను ద్రవిడ్ దాటవేశాడు. అయితే, జనవరి 11న కోహ్లీ కూతురు వామిక పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే కుటుంబ సమేతంగా వేడుక చేసుకోవాలని భావించి తొలి టీ20 మ్యాచ్ నుంచి వైదొలిగాడు. కాగా, ఇప్పుడు విరాట్ కోహ్లీ తొలి టీ20 మ్యాచ్‌లో ఆడడం లేదు. మరి టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

ఓపెనర్స్ ఎవరు?

మ్యాచ్‌కు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఆడకపోతే మూడో నంబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను పంపే అవకాశం ఉంది. అలాగే శుభ్‌మన్ గిల్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి కావడంతో అతనికి జట్టులో అవకాశం దక్కడం ఖాయం.

ఈ టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ తర్వాత ఎవరికి అవకాశం దక్కుతుందో చూస్తే.. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావచ్చు. జితేష్ శర్మ కూడా జట్టులో ఉన్నప్పటికీ సంజూ శాంసన్‌కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల, అతను దక్షిణాఫ్రికాపై మూడో నంబర్‌లో బ్యాటింగ్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. అంటే ఫామ్‌లో ఉన్న సంజుకు తొలి టీ20 మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు.

శివమ్ దూబేకి అవకాశం?

హార్దిక్ పాండ్యా గైర్హాజరీతో శివమ్ దూబేకి జట్టులో అవకాశం కల్పించారు. అతను ఆల్‌రౌండర్‌గా ఆడటం చూడవచ్చు. బ్యాటింగ్‌తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది. రింకూ సింగ్ కూడా ఆడటం దాదాపు ఖాయం. ప్రస్తుతం, చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంలో అతనికి సాటిలేదు. అంతేకాకుండా, జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. అందుకే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

జట్టులో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తే మాత్రం కచ్చితంగా రవి వైపు టీమ్ మొగ్గు చూపుతుంది. ఎందుకంటే, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రవి అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సమయంలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ పేస్ త్రయం ఆడటం దాదాపు ఖాయం.

తొలి మ్యాచ్‌కి భారత్ ప్రాబబుల్ స్క్వాడ్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణో పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్