IPL 2025: బాధలో ఉన్న కిషన్ ను అంబానీ వైఫ్ ఏంచేసిందో తెలుసా? చూస్తే వావ్ అంటారు!
ముంబై ఇండియన్స్-SRH మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. హైదరాబాద్ తక్కువ స్కోర్ చేయగా, ముంబై బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించింది. ఇషాన్ కిషన్ SRH తరపున తొలిసారి ముంబై వేదికగా ఆడి విఫలమయ్యాడు. మ్యాచ్ తర్వాత అతనికి నీతా అంబానీ ఓదార్చిన తీరు అభిమానుల హృదయాలను తాకింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం జరిగిన ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్ ముంబై విజయంతో ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆటతో పాటు భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 162 పరుగులకే పరిమితమైపోయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి హోరాహోరీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ముంబై బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించారు. విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 15 బంతుల్లో 26 పరుగులు చేయగా, తిలక్ వర్మ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్ బంతితో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. SRH తరఫున హెన్రిచ్ క్లాసెన్ 37 పరుగులు చేసి, చివర్లో అనికేత్ వర్మ కొన్ని మంచి షాట్లు కొట్టినా విజయం మాత్రం హైదరాబాద్ కి దక్కలేదు.
అయితే ఈ మ్యాచ్‌లో అత్యంత అందమైన క్షణంగా నిలిచిన దృశ్యం ఇషాన్ కిషన్ గురించి. గతంలో ఏడు సీజన్లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్, ఈసారి వేలంలో SRH తరపున ఆడుతున్నాడు. వాంఖడే స్టేడియంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా బరిలోకి దిగడం ఇది మొదటిసారి. కానీ ఈ మ్యాచ్‌లో అతను కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తరువాత ఇషాన్ కిషన్ కాస్త నిరాశతో కనిపించగా, ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అతనిని ఓదార్చడం భావోద్వేగభరితంగా కనిపించింది. తన చెంపపై ప్రేమగా చేయి పెట్టి, అతనితో మాట్లాడిన నీతా అంబానీకి ఇషాన్ చిరునవ్వుతో స్పందించాడు. ఇది అభిమానుల మనసులను తాకిన మూమెంట్‌గా మారింది.
ఈ విజయం ముంబైకి ఎంతో కీలకమైనదిగా నిలిచింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో SRH మాత్రం ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ మరో నాలుగు మ్యాచ్‌లు కనీసం గెలవాల్సిన పరిస్థితి ఉంది. టోర్నమెంట్ మిడ్‌స్టేజ్‌కు చేరుతున్న వేళ, SRHకు ఇది గట్టి సవాల్‌గా మారింది. మిగతా మ్యాచ్‌లలో ఏ జట్టు ఎలా రాణిస్తుందో చూడాల్సిందే కానీ, ముంబై తన పుంజుకుంటున్న ఫామ్‌తో ప్లేఆఫ్స్ దిశగా నడుస్తూ అభిమానులకు ఆశలు నూరిపోస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



