AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: దులీప్ ట్రోఫీలో అట్టర్ ఫ్లాప్.. టీమిండియా సీనియర్ ప్లేస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దిల్లున్నోడు..

Musheer Khan May Replace Team India: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2024 మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైనా.. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. త్వరలో భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటానని ముషీర్ ఖాన్ తన బ్యాటింగ్‌తో చూపించాడు.

Team India: దులీప్ ట్రోఫీలో అట్టర్ ఫ్లాప్.. టీమిండియా సీనియర్ ప్లేస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దిల్లున్నోడు..
Musheer Khan Kl Rahul
Venkata Chari
|

Updated on: Sep 08, 2024 | 12:07 PM

Share

Musheer Khan May Replace Team India: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ 2024 మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైనా.. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. త్వరలో భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటానని ముషీర్ ఖాన్ తన బ్యాటింగ్‌తో చూపించాడు. భారత్ తరపున ఆడిన బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడుతున్న పిచ్‌పై ముషీర్ ఖాన్ చాలా తెలివిగా బ్యాటింగ్ చేసి జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్లాడు.

తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ బి బ్యాటింగ్ అంతగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కేవలం 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ త్వరగా ముగిసేలా కనిపించింది. అయితే, ఆ తర్వాత ముషీర్ ఖాన్ ఒంటరిగా బాధ్యతలు స్వీకరించాడు. నవదీప్ సైనీతో కలిసి జట్టును 300 దాటించాడు. ఈ క్రమంలో ముషీర్ ఖాన్ 373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. నవదీప్ సైనీతో కలిసి 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ కారణంగానే ముషీర్ ఖాన్ గురించి ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేఎల్ రాహుల్ స్థానంలో ముషీర్ ఖాన్ జట్టులోకి రావచ్చు..

మరోవైపు భారత్ ఎ తరపున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ పరాజయం పాలయ్యాడు. కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 111 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. కేఎల్ రాహుల్ ఇంతకు ముందు కూడా టెస్ట్ మ్యాచ్‌లలో ఫ్లాప్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో, అతనిపై కత్తి వేలాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను ఎక్కువ పరుగులు చేయలేకపోతే, అతనిని డ్రాప్ చేయవచ్చు. అతని స్థానంలో ముషీర్ ఖాన్ మంచి ఎంపిక కావచ్చు. ముషీర్ కూడా బౌలింగ్ చేయగలడు. కాబట్టి, టీమ్ ఇండియాకు అద్భుతమైన ఆల్ రౌండ్ ఎంపిక లభిస్తుంది.

ఇప్పటికే రంజీ ట్రోఫీలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ముషీర్ ఖాన్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలోనూ తన ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..