‘రోహిత్ కాదు..’నో హిట్ శర్మ’.. నేను కెప్టెన్ ఐతే, ప్లేయింగ్ 11లోనూ చోటివ్వను’.. మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్..
Rohit Sharma: ఐపీఎల్ 2022 నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువగా ఉంది. అతని స్ట్రైక్ రేట్ కూడా 125 కంటే తక్కువగా నిలిచింది. మొత్తంగా 24 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు.

Rohit Sharma in IPL 2023: ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఫ్లాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023లో అతను 10 ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులు కూడా పూర్తి చేయలేకపోయాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో అతను ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మూడు బంతులు ఆడి ఎటువంటి పరుగులేమీ చేయకుండా ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాఖ్యాత శ్రీకాంత్ అతనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు కొత్త పేరు పెట్టాడు.
రోహిత్ ఔట్ అయిన వెంటనే, భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత వ్యాఖ్యాత శ్రీకాంత్, ‘రోహిత్ శర్మ తన పేరును “నో హిట్ శర్మ”గా మార్చుకోవాలి. నేను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉంటే ప్లేయింగ్ 11లో అతనికి స్థానం కల్పించను’ అంటూ షాకిచ్చాడు.
CSKపై సున్నాకి ఔట్ కావడమే కాకుండా, రోహిత్ తన పేరిట ఒక ఇబ్బందికరమైన రికార్డును కూడా సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నాతో ఔట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.




గత ఏడాది నుంచి రోహిత్ విఫలం..
రోహిత్ శర్మ ఈ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 18.40 బ్యాటింగ్ సగటుతో 184 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ కూడా 126.90గా నిలిచింది. గత సీజన్‌లోనూ రోహిత్ ఫామ్‌లో లేడు. గత సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 268 పరుగులు చేశాడు. ఈ సమయంలో కూడా అతని బ్యాటింగ్ సగటు 19.14 మాత్రమే. హిట్‌మ్యాన్ స్ట్రైక్ రేట్ కూడా 120కి పరిమితమైంది.
రోహిత్ శర్మ గత ఏడాది కాలంగా ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఫ్లాప్ అవుతున్నాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. ఎప్పుడైతే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడో అప్పటి నుంచి అతడి బ్యాడ్ ఫేజ్ మొదలైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




